Chiranjeevi: చిరుతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్న యంగ్‌ హీరో.. ఆ లక్కీ చాన్స్‌ ఎవరికి ?

సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఏజ్‌తో సంబంధం లేకుండా యంగ్‌ హీరోలకు పోటీగా వరుసగా ప్రాజెక్ట్‌లు లైన్‌లో పెడుతున్నాడు. కరోనా కారణంగా కాస్త గ్యాప్‌ ఇచ్చినా ఆ తరువాత వరుసగా మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య, గాడ్‌ఫాదర్‌, వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు.

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 02:00 PM IST

ప్రస్తుతం భోళా శంకర్‌ సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను అలరించబోతున్నాడు. మెహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కలకత్తాలో జరుగుతోంది. ఆ తరువాత యూరప్‌, హైదరాబాద్‌లో మరో రెండు షెడ్యూల్స్‌ ఉన్నాయి. ఈ సినిమా ఇంకా కంప్లీట్‌ కాకముందే నెక్ట్స్‌ సినిమాను లైన్‌లో పెట్టాడు మెగాస్టార్‌. సోగ్గాడే చిన్ని నాయనా ఫేస్‌ కళ్యాణ్‌ కృష్ణతో సినిమా ప్లాన్‌ చేశాడు. భోళా శంకర్‌ తరువాత ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.

అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రను ఇప్పుడున్న యంగ్‌ హీరోస్‌తో చేయించాలి అనుకుంటున్నాడట డైరెక్టర్‌ కళ్యాణ్‌ కృష్ణ. ఇందుకోసం విజయ్‌ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డను సంప్రదించబోతున్నట్టు సమాచారం. అర్జున్‌ రెడ్డితో లైఫ్‌ టర్న్‌ తీసుకున్న విజయ్‌ దేవరకొండకు యూత్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లోని స్టార్‌ హీరోల్లో ఒకడిగా కంటిన్యూ అవుతున్నాడు. అటు సిద్ధూ జొన్నలగడ్డ కూడా డీజే టిల్లు సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ ఇద్దరిలో ఒకరు చిరంజీవి సినిమాలో రోల్‌ చేస్తే బాగుంటుందని డైరెక్టర్‌ కళ్యాణ్‌ కృష్ణ ప్లాన్‌ చేస్తున్నారట. అయితే వీళ్లిద్దరిలో చిరు ఎవరిని ఒకే చేస్తారనేది చూడాలి.