CHIRANJEEVI: చిరంజీవి-బాలయ్య అన్‌స్టాపబుల్ షో ప్రశ్నలు లీక్..!

మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వూతో కొత్త సీజన్ మొదలు పెట్టాలని బాలయ్య అండ్ టీం అనుకుంటోందట. లేదంటే అన్ స్టాపబుల్ మూడో సీజన్ చివరి ఇంటర్వూ అయినా చిరుది ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. విచిత్రం ఏంటంటే ఇంతవరకు అన్ స్టాపబుల్ మూడో సీజన్ షురూ అయ్యే డేట్ ఎనౌన్స్ కాలేదు.

  • Written By:
  • Publish Date - August 24, 2023 / 07:25 PM IST

CHIRANJEEVI: నటసింహం బాలయ్య అన్‌స్టాపబుల్ షో తాలూకు కొత్త సీజన్ షురూ కాబోతోంది. దసరా స్పెషల్‌గా ఈ షోని టెలికాస్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే సెప్టెంబర్‌లో ఇంటర్వూలు ప్లాన్ చేస్తున్నట్టే అనుకోవాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వూతో కొత్త సీజన్ మొదలు పెట్టాలని బాలయ్య అండ్ టీం అనుకుంటోందట. లేదంటే అన్ స్టాపబుల్ మూడో సీజన్ చివరి ఇంటర్వూ అయినా చిరుది ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

విచిత్రం ఏంటంటే ఇంతవరకు అన్ స్టాపబుల్ మూడో సీజన్ షురూ అయ్యే డేట్ ఎనౌన్స్ కాలేదు. ఇంతలోనే చిరుని బాలయ్య అడిగే ప్రశ్నలు లీకయ్యాయి. నిజం చెప్పాలంటే అన్ స్టాపబుల్ రెండో సీజన్‌లోనే చిరు ఇంటర్వూ ప్లాన్ చేశారు. ఎందుకో కుదర్లేదు. దీంతో ఆ ఇంటర్వూ ప్రశ్నలు ఇంకా ఆ షో నడిపించే టీం మెంబర్స్ దగ్గరే ఉండిపోయాయి. అవే ఇప్పుడు లీకయ్యాయి. వాటి ప్రకారం చూస్తే చిరు తన తమ్ముడు పవన్‌కి తొలినాళ్లలో వచ్చిన క్రేజ్ గురించి కంగారు పడ్డాడా..? పవన్ పెళ్లిళ్లు.. వాటిమీద కామెంట్లకు ఎలా అనిపించేది..?

చిరు ఎందుకు రాజకీయాలు వదిలేశాడు..? నాగబాబు హీరోగా ఎందుకు సక్సెస్ కాలేదనుకుంటున్నారు..? మెగా ఫ్యామిలీని విడకొట్టాలనే వాళ్ళెవరు..? అలాంటి ప్రయత్నాలు మీ దృష్టికి వచ్చాయా..? ఇవి రెండో సీజన్‌లో చిరు ఇంటర్వూ ఇస్తే అడగాలనుకున్న ప్రశ్నలు. ఇవే ప్రశ్నల్ని మూడో సీజన్‌లో చిరు వస్తే అడిగేందుకు రెడీగా ఉంచిందట అన్ స్టాపబుల్ టీం.