CHIRANJEEVI: తెల్ల జుట్టు, తెల్లగడ్డంతో మెగాస్టార్.. విశ్వంభరలో సరికొత్త లుక్..

చిరు 20 ఏళ్ల కొడుక్కి తండ్రిగా కనిపించబోతున్నాడట. తన గతం, తను చేసిన సాహసాలు తన కొడుక్కి వివరించే సీన్‌తో విశ్వంభర మొదలు కానుందట. దీంతో చిరు ఫస్ట్ టైం తన ఏజ్‌కి తగ్గ పాత్రలో కనిపించబోతున్నాడని తేలిపోతోంది.

  • Written By:
  • Updated On - February 17, 2024 / 08:09 PM IST

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా తెల్ల జుట్టు, తెల్లగడ్డంతో కనిపిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. విశ్వంభరలో ఆ గెటప్ ఉండబోతోందట. ఆమధ్య భోళా శంకర్ కోసమో, లేదంటే వాల్తేర్ వీరయ్య కోసమో మొత్తానికి గుండు గెటప్ ట్రై చేశాడు. కాని ఎక్కడా పెద్దగా యూజ్ చేయలేదు. కాని ఈసారి కమల్ హాసన్ భారతీయుడిలో వేసిన గెటప్‌ని మించేలా మెగా ప్లానింగ్ జరుగుతోంది. చిరు 20 ఏళ్ల కొడుక్కి తండ్రిగా కనిపించబోతున్నాడట.

Allu Arjun : అంతర్జాతీయ వేదికపై టాలీవుడ్ ఐకాన్ స్టైలిష్ స్టార్.. అల్లు అర్జున్..

తన గతం, తను చేసిన సాహసాలు తన కొడుక్కి వివరించే సీన్‌తో విశ్వంభర మొదలు కానుందట. దీంతో చిరు ఫస్ట్ టైం తన ఏజ్‌కి తగ్గ పాత్రలో కనిపించబోతున్నాడని తేలిపోతోంది. కింగ్ నాగార్జున కూడా ఇంచుమించు చిరు దారిలోనే నడవబోతున్నాడు. రిటైర్డ్ ఐపీఎస్‌గా శేఖర్ కమ్ముల మేకింగ్ లో ధనుష్ చేసే మూవీలో కనిపించబోతున్నాడట. నిజానికి టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో బాలయ్య భగవంత్ కేసరిలో యంగ్ స్టర్‌కి తండ్రిగా, ఏజ్ బార్ రోల్ వేశాడు. వెంకీ అయితే దృశ్యంలో కాలేజ్ కెళ్లి కూతురి తండ్రిగా కనిపించాడు. ఇలా ఈ ఇద్దరు ఫిఫ్టీస్ లేదంటే సిక్స్‌టీస్ ఏజ్‌కి తగ్గ పాత్రలు వేశారు.

ఎటొచ్చి చిరు, నాగ్‌లే ఇప్పుడిప్పుడు ఈ దార్లో నడుస్తున్నట్టున్నారు. మమ్ముటి, మోహన్ లాల్, రజినీకాంత్, కమల్ హాసన్ ఇలా అంతా అమితాబ్ రూట్లో ఏజ్‌కి తగ్గ పాత్రలు వేస్తూ రూట్ మారిస్తే, ఇప్పుడిప్పుడే ఆదారిలో నడిచేందుకు చిరు లెక్కే మార్చాడు. నాగ్.. మెగాస్టార్ అడుగు జాడల్లో నడిచేలా ఉన్నాడు.