CHIRANJEEVI-PRABHAS: మెగాస్టార్ మెగా ప్రేమకి ఫిదా అవుతున్న రెబల్ స్టార్

మెగాస్టార్ నుంచి ప్రభాస్ మూవీ టీంకి మాత్రం చిరు కానుక కన్పామ్ అయ్యింది. అదేంటంటే ఒక వేళ దిరాజా సాబ్ సంక్రాంతికే వచ్చేటట్టైతే, మెగాస్టార్ మూవీ విశ్వంభర పక్కకు తప్పుకునే అవకాశాలే ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 07:08 PM IST

CHIRANJEEVI-PRABHAS: మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేస్తున్న మూవీ విశ్వంభర. త్రిష కూడా ఇందులో డ్యూయెల్ రోల్ వేస్తోంది. తల్లి, కూతురు పాత్రల్లో కనిపించబోతోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత ఆ రేంజ్ సోషియో ఫాంటసీ మూవీని చిరు చేస్తున్నాడు. ఇక ఈ మూవీ సంక్రాంతికే రిలీజ్ అని ఎప్పుడో తేల్చారు. కాకపోతే ఇప్పుడు పొంగల్ పోరు నుంచి ఈ మూవీ పక్కకు తప్పుకోబోతోంది. హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంకా కన్ఫామ్ కాలేదు.

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ పదో తరగతి సర్టిఫికెట్ చూశారా..!

కానీ, మెగాస్టార్ నుంచి ప్రభాస్ మూవీ టీంకి మాత్రం చిరు కానుక కన్పామ్ అయ్యింది. అదేంటంటే ఒక వేళ దిరాజా సాబ్ సంక్రాంతికే వచ్చేటట్టైతే, మెగాస్టార్ మూవీ విశ్వంభర పక్కకు తప్పుకునే అవకాశాలే ఉన్నాయి. యూవీ క్రియేషన్స్‌తో పాటు విశ్వంభర టీంకి ఉన్న అనుబంధంతో పాటు చిరు, ప్రభాస్ మధ్య ఉన్న స్నేహం, అలానే మారుతికి మెగా డైరెక్టర్‌గా ఉన్న గుర్తింపు.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకతప్పట్లేదు. అంతమాత్రానికే కలిసొచ్చే సంక్రాంతి సీజన్‌ని విశ్వంభర టీం వదులుకుంటుందా..? దీనికి అక్కడ మరో రీజన్ కూడా ఉందని తెలుస్తోంది. విశ్వంభరలో భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో, కేవలం గ్రాఫిక్స్ వర్క్‌కే 8 నెలల టైం పట్టేలా ఉందట.

ముందే ఆ సీన్లు తీసినా ఖచ్చితంగా సంక్రాంతికి విశ్వంభర వస్తుందని చెప్పే పరిస్థితి లేదు. అందుకే.. పొంగల్ పోరుని వద్దనుకుంటోంది ఫిల్మ్ టీం. అది కూడా కుదరకపోతే, ఒకవేళ అనుకున్న టైంకి మూవీ రిలీజ్ అవ్వగలిగితే, అప్పుడు ప్రభాస్ ది రాజా సాబ్ వచ్చేలా ఉంటే, అలా కూడా ప్రభాస్‌కే సైడ్ ఇచ్చేయాలనేది చిరు నిర్ణయమట. ఇంతగా డార్లింగ్ కోసం మెగా త్యాగానికి చిరు సిద్దమౌతున్నాడు.