Bhola Shankar: భోళాశంకర్‌లో వెన్నుపోటు డైలాగ్‌.. మెగాస్టార్ ఎవరిని టార్గెట్ చేశాడు..?

చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయితే అందులో ఏమన్నా రాజకీయ కౌంటర్‌లు ఉన్నాయేమో అని సెర్చ్‌ చేయడం కామన్. నిన్నటికి నిన్న బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబుని ఉద్దేశించి డైలాగులు, డాన్స్ పెట్టడంతో భోళా శంకర్‌లోనూ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనే అనుమానాలు రావడం సహజం.

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 01:22 PM IST

Bhola Shankar: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇప్పుడు దేశమంతా ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఏ మాట మాట్లాడినా.. ఏ నిర్ణయం తీసుకున్నా.. అది ఎన్నికల కోసమే అని పోలికలు ఆటోమెటిక్‌గా స్టార్ట్ అయిపోతున్నాయి. ఒకప్పుడు రాజకీయాల్లో ఉండి.. మళ్లీ ఇప్పుడు సినిమాలకు పరిమితం అయిన వాళ్ల నుంచి పరోక్షంగా పొలిటికల్ డైలాగులు వస్తే.. విషయం మరింత హీటెక్కడం ఖాయం. భోళాశంకర్ విషయంలో అదే జరిగినట్లు కనిపిస్తోంది.

ఎన్నికల వేళ మాములుగా మాట్లాడినా.. అందులో పొలిటికల్ కౌంటర్ ఏమన్నా ఉందేమో అని వెతుక్కునే పరిస్దితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయితే అందులో ఏమన్నా రాజకీయ కౌంటర్‌లు ఉన్నాయేమో అని సెర్చ్‌ చేయడం కామన్. నిన్నటికి నిన్న బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబుని ఉద్దేశించి డైలాగులు, డాన్స్ పెట్టడంతో భోళా శంకర్‌లోనూ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనే అనుమానాలు రావడం సహజం. ఐతే భోళాశంకర్ సెకండాఫ్‌లో వినిపించిన ఓ డైలాగ్‌ రాజకీయాలను ఉద్దేశించే పెట్టారా అనే చర్చ జరుగుతోంది. కథ చూస్తే సెకండాఫ్‌లో చిరంజీవి ఒంటరిగా నడుచుకుంటూ వస్తూంటాడు. రౌడీలు చిరంజీవిని పొడిచేసి వెళ్లిపోతారు. హీరో అలా పడిపోయి ఉన్నప్పుడు కీర్తిసురేష్‌ వచ్చి కాపాడే ప్రయత్నం చేస్తుంటుంది.

వెనకాల పొడవడంతో రక్తం కారుతుంటుంది. రక్తం కారిపోతుందని కీర్తి సురేష్‌ బాధపడుతుంటే ఇలాంటి వెన్నుపోట్లు మామూలే అని హీరో అంటాడు. ఐతే ఈ డైలాగులో పొలిటికల్ యాంగిల్ ఏమన్నా ఉందేమో అని వెతుకుతున్నారు. చిరంజీవికి పార్టీ పెట్టిన టైమ్‌లో ఎవరైనా వెన్నుపోటు పొడిచారా లేక సినిమాల్లో తన అనుకున్న వాళ్లు వెన్నుపోటు పొడిచారా.. అసలు సంగతి ఏంటి అని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.