Ram Charan: రామ్‌చరణ్‌ కూతురు పేరు క్లింకారా.. అర్థం తెలుసా ?

మెగా ఫ్యామిలీలోకి బుల్లి ప్రిన్సెస్ అడుగు పెట్టింది. మనవరాలి రాకతో మహాలక్ష్మి వచ్చిందంటూ.. మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. రాంచరణ్‌, ఉపాసనకు పెళ్లి అయిన పదేళ్ల తర్వాత పుట్టింది మెగా ప్రిన్సెస్. దీంతో మనవరాలి విషయంలో చిరు తెగ మురిసిపోతున్నారు.

  • Written By:
  • Publish Date - June 30, 2023 / 04:44 PM IST

ఆయన ఆనందానికి హద్దుల్లేకుండా ఉన్నాయ్. వారసురాలి బారసాల ఫంక్షన్ నభూతో అనిపించేలా నిర్వహించారు చిరు అండ్ ఫ్యామిలీ. మెగా ప్రిన్సెస్‌ అని పిలుచుకుంటున్న రామ్‌చరణ్‌-ఉపాసనల కూతురుకు.. క్లింకారా అని పేరు పెట్టారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవి స్వయంగా తన మనవరాలి పేరును ప్రకటించారు. లలితా సహస్ర నామం నుంచి ఈ పేరు తీసుకున్నట్లు వివరించారు. క్లింకారా అంటే ప్రకృతికి ప్రతిబింబం అని.. అమ్మవారి శక్తి రూపానికి ప్రతిరూపం అని అర్థం. ఈ గుణాలను పోగుచేసుకొని తన మనవరాలు ఎదగాలంటే.. చిరు చేసిన ట్వీట్ అభిమానులను ఖుషీ చేస్తోంది. క్లింకారా పేరు కొత్తగా ఉందని.. అభిమానులు మురిసిపోతున్నారు.

చిరు ఇలా ప్రకటించారో లేదో.. క్లింకారా పేరుతో.. సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. నిజానికి మంగళవారం రోజు పాప పుట్టడంతో ఆమెకు ఆంజనేయస్వామి పేరు కలిసి వచ్చేలా నామకరణం చేస్తారని అంతా అనుకున్నారు. అ అనే అక్షరంతో పేర్లు కూడా పరిశీలించినట్లు వార్తలు వినిపించాయ్. ఐతే ఆ అమ్మవారి నామం వచ్చేలా క్లింకారా అనే పేరు ఫైనల్ చేశారు. ఇక అటు బారసాల ఫంక్షన్‌కు దేశంలోని ప్రముఖుల నుంచి భారీ గిఫ్ట్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. అంబానీ కూడా చిరు మనవరాలి కోసం ప్రత్యేకంగా బహుమతి పంపించారని టాక్ నడుస్తోంది.

ఏమైనా బారసాల ఫంక్షన్ మాత్రం నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనే రేంజ్‌లో జరిగింది. జూన్20న అపోలో ఆస్పత్రిలో ఉపాసన.. మెగా ప్రిన్సెస్‌కు జన్మనిచ్చింది. పాప పుట్టాక తొలిసారి మీడియా ముందుకొచ్చిన చరణ్‌.. తన బిడ్డ నాన్న పోలికతోనే ఉందని చెప్పారు. ఐతే ఇప్పుడు బారసాల ఫంక్షన్ కూడా కావడంతో.. మెగా ప్రిన్సెస్ ఎలా ఉందా అని చూడడానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు.