CHIRANJEEVI: సుకుమార్, వశిష్ట.. ఇద్దిరి మేకింగ్‌లో మెగా ప్లానింగ్..?

వశిష్ట మూవీ చేయబోతున్న చిరు, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తాడంటున్నారు. మరి బన్నీతో మాటల మాంత్రికుడి మూవీ ఏమైనట్టంటే, అక్కడే చిన్న మార్పు జరిగింది. జవాన్ హిట్ తర్వాత ఆట్లీ ఇప్పుడు బన్నీతో సినిమా ప్లాన్ చేశాడు. సో.. అల్లు అర్జున్ ఆ ప్రాజెక్ట్‌తో బిజీ అయ్యే టైంలో చిరుతో త్రివిక్రమ్ సినిమా తీసేస్తాడట.

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 06:11 PM IST

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా తన కూతురు సుస్మిత నిర్మించబోయే సినిమాను ఆపేశాడు. వెంటనే.. యంగ్ డైరెక్టర్ వశిష్ట మేకింగ్‌లో చేయబోయే సోషియో ఫాంటసీ కోసం రెడీ అవుతున్నాడు. మోకాలి సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకుంటున్న చిరు, సాహసాలు చేసేందుకు కూడా రెడీ అవుతున్నాడట. ప్రజెంట్ ఫిజియోథెరపీ తీసుకుంటున్నాడట. ఇక చిరు కమిటైన, కమిటవుతున్న సినిమాలే మెగా కన్‌ఫ్యూజన్‌కి కారణమౌతున్నాయి. వశిష్ట మూవీ చేయబోతున్న చిరు, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తాడంటున్నారు.

మరి బన్నీతో మాటల మాంత్రికుడి మూవీ ఏమైనట్టంటే, అక్కడే చిన్న మార్పు జరిగింది. జవాన్ హిట్ తర్వాత ఆట్లీ ఇప్పుడు బన్నీతో సినిమా ప్లాన్ చేశాడు. సో.. అల్లు అర్జున్ ఆ ప్రాజెక్ట్‌తో బిజీ అయ్యే టైంలో చిరుతో త్రివిక్రమ్ సినిమా తీసేస్తాడట. అంతవరకు బానే ఉంది కాని, రామ్ చరణ్‌తో సినిమా ప్లాన్ చేసిన సుకుమార్ కూడా రూట్ మరుస్తున్నాడు. పుష్ప-2 తర్వాత సుకుమార్ చిరు సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మరి చెర్రీతో రంగస్థలాన్ని మించే మూవీ ప్లాన్ ఏమైనట్టు అంటే, అక్కడే సీన్‌లోకి బుచ్చిబాబు వచ్చాడు. ఈ సినిమా రెండు భాగాలుగా అంటే, కనీసం రెండేళ్లు చెర్రీ ఈ ప్రాజెక్ట్‌తోనే బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ గ్యాప్‌లో చిరుతో సినిమా తీయాలనేది సుకుమార్ ప్లానింగ్ అని తెలుస్తోంది. అలానే అనిల్ రావిపుడి కూడా చిరంజీవితోనే సినిమా ప్లాన్ చేశాడు. భగవంత్ కేసరి ఈ నెలలో దసరా స్పెషల్‌గా రానుంది తర్వాత చిరు సినిమానే అంటున్నారు. అంతా బానే ఉంది. చిరు ప్లానింగ్ అదిరింది.

కాని అనిల్, సుకుమార్, త్రివిక్రమ్ ముగ్గురికి చిరు 2024 జూన్ నుంచి ఎలా ఒకేసారి డేట్లిస్తాడు. ఈ డౌట్‌కే దర్శకుల ప్లానింగ్ గేట్ వేస్తోంది. అనిల్ రావిపుడి, త్రివిక్రమ్ సినిమాలు ప్యారలల్‌గా ప్లాన్ చేస్తున్న చిరు.. వశిష్ట మూవీని, సుకుమార్ సినిమాని కూడా అలాగే ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇలా ఈ గ్యాప్‌లో పర్పెక్ట్ ప్లానింగ్‌తో మంచి లైనప్‌ని రెడీ చేసుకుంటున్నాడు మెగాస్టార్.