Urvashi Rautela: చిరంజీవి చెయ్యి ఊర్వశి రౌతేలాకి బాగా కలసివచ్చిందా?

ఊర్వశి రౌతేలాకు అదిరిపోయే హిట్స్‌ లేకపోయినా.. ఈ అమ్మడి గ్లామర్‌కు యూత్‌ ఫిదా అయిపోయారు. ఫేస్‌లో హీరోయిన్‌ ఫీచర్స్‌ తక్కువే అయినా.. ఈ అమ్మడితో ఒక్క ఐటంసాంగ్‌ అయినా చేయాలని హీరోలు అనుకోవడమే కాదు.. ఛాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 11, 2023 / 12:42 PM IST

Urvashi Rautela: చిరంజీవిని అంటిపెట్టుకుని తిరిగినందుకు ఐటంగర్ల్‌ ఊర్వశి రౌతేలాకి బాగానే వర్కవుట్‌ అయింది. మెగాస్టార్‌ ఆశీస్సులతో ఆమె కెరీర్‌ ‘3 వీడియో ఆల్బమ్స్‌.. 6 ఐటంసాంగ్స్‌’లా నడిచిపోతోంది. హిందీలో రాని గుర్తింపు మెగాస్టార్‌తో ఆడిపాడడంతో తెలుగులో వచ్చింది.

ఊర్వశి రౌతేలాకు అదిరిపోయే హిట్స్‌ లేకపోయినా.. ఈ అమ్మడి గ్లామర్‌కు యూత్‌ ఫిదా అయిపోయారు. ఫేస్‌లో హీరోయిన్‌ ఫీచర్స్‌ తక్కువే అయినా.. ఈ అమ్మడితో ఒక్క ఐటంసాంగ్‌ అయినా చేయాలని హీరోలు అనుకోవడమే కాదు.. ఛాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఊర్వశి రౌతేలా. వేర్ ఈజ్ ద పార్టీ సాంగ్‌లో చిరుతో కలిసి స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ పెద్ద హిట్ అవ్వడంతో వరుస ఐటంసాంగ్స్‌ను కబ్జా చేసేస్తోంది. వాల్తేరు వీరయ్య ఈవెంట్‌లో ఊర్వశికి షేక్‌హ్యాండ్ ఇచ్చి ఈ అయిస్కాంతం చేతిలో ఐస్‌ అయిపోయాడు మెగాస్టార్‌. చిరు మనసే దోచుకున్న అయస్కాంతం ఎవరా అని ఇండస్ట్రీ దృష్టి ఈ అమ్మడిపై పడింది.

వాల్తేరు వీరయ్యలో చేసిన సందడితో కాంతారా దర్శకుడు రిషబ్‌ శెట్టి దృష్టిలో పడి.. కాంతారా2లో ఛాన్స్‌ కొట్టేసింది. రిషబ్‌తో దిగిన ఫొటో షేర్‌ చేసి కాంతార2 లోడింగ్‌ అంటూ.. చిత్ర యూనిట్‌ ప్రకటించకుండానే.. తను కూడా ఆ సినిమాలో భాగమే అని ఎనౌన్స్‌ చేసుకుంది. ఆల్రెడీ బోయపాటి సినిమాలో రామ్‌తో కలిసి స్పెషల్‌ సాంగ్‌తో రాబోతుంది. ఈ సాంగ్ షూటింగ్ కూడా పూర్తైంది. అఖిల్ ఏజెంట్‌లోనూ ఈఅమ్మడే ఐటంగర్ల్. సినిమా ప్రమోషన్‌లో అఖిల్ మాట్లాడుతూ.. ఆల్బమ్‌లో తనకిష్టమైన సాంగ్ ఇదే అన్నాడు. పదేళ్లుగా హిందీలో నటిస్తున్నా రాని వరుస ఆఫర్స్‌ ఊర్వశి రౌతేలాకి వాల్తేరు వీరయ్య తీసుకొచ్చింది. ఇదే ఊపులో తెలుగులో హీరోయిన్ ఛాన్స్ కూడా కొట్టేస్తుందేమో ఊర్వశి!