లేదంటే చిరు మంచితనం మరోలా ఫోకస్ అయ్యలే ఉందంటున్నారు. రీసెంట్ గా జరగిని సంఘటనే మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తోంది. చరణ్ బర్త్ డేకి బన్నీ రాకపోవటమే కాకుండా, ట్వీట్ కూడా చేయలేదు. కాని తన 20ఏళ్ల ప్రయాణం మీద ట్వీట్ పోస్ట్ చేశాడు. దీంతో బన్నీ ప్రవర్తన నచ్చక మెగా ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.
అలాంటి టైంలో బన్నీ చర్యల్ని పట్టించుకోకుండా, పెద్ద మనసుతో, అల్లు అర్జున్ ని ట్వీట్ తో విష్ చేశాడు చిరు. చరణ్ ని కావాలని పక్కన పెట్టిన బన్నీకోసం చిరు ఇలా అతి మంచితనంతో ట్వీట్ చేయటం ఏంటనేది మెగా ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ కి కారణమౌతోందట. గతంలో ఏపీ సీఎం ముందు కూడా ఇండస్ట్రీ కోసం చిరు తగ్గటం చూసి సాధారణ జనం మెచ్చుకున్నా, ఓరేంజ్ స్టార్ అలా తగ్గటం ఏంటనే, మెగా ఫ్యాన్స్ కొంతవరకు హర్ట్ అయ్యారు. ఏదేమైనా చిరు పెద్దరికం, మంచి మనసుతో జూనియర్స్ తనని చూసి నేర్చుకునేలా ముందడుగు వేస్తున్నాడు. అది మెచ్చుకోతగిందే.. కాని బన్నీ, మెగా హీరోగా వచ్చిన మెగా హీరోలనే లెక్కచేయట్లేదనేది అభిప్రాయం వల్ల బన్నీని చిరు విష్ చేయటం మెగా ఫ్యాన్స్ కి మాత్రం నచ్చలేదని తెలుస్తోంది.