యువ హీరోలతో పోటీ పడి వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వందల కోట్ల వసూళ్లను టార్గెట్ చేస్తూ చిరంజీవి సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఆచార్య ఫ్లాప్ తర్వాత చిరంజీవి కాస్త జాగ్రత్త పడుతూ కథలను సెలెక్ట్ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాను లైన్ లో ఉంచారు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. వాస్తవానికి జనవరి మొదటి వారం లేదా సంక్రాంతి తర్వాత సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా… రామ్ చరణ్ సినిమా కోసం వాయిదా వేసుకున్నారు చిరంజీవి.
ప్రస్తుతం ఈ సినిమా షూట్ కాస్త ఆలస్యం అవుతోంది. త్వరలోనే కొన్ని సాంగ్స్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమా తర్వాత చిరంజీవి ప్రాజెక్ట్ ఏంటీ అనేది ఇప్పుడు క్లారిటీ రావడం లేదు. ఈ విషయంపై చిరంజీవి కూడా అసలు బయటపడటం లేదు. ‘విశ్వంభర’ సంక్రాంతి తర్వాత విడుదల కాబట్టి చిరంజీవి తర్వాతి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. కూల్ గానే విశ్వంభర ప్రమోషన్స్ పై ఫోకస్ చేసారు. కాని చిరంజీవి కోసం చాలా మంది డైరెక్టర్ లు స్టోరీలు రెడీ చేసుకుని… వినిపించడానికి సిద్దంగా ఉన్నా చిరూ మాత్రం ఫోకస్ చేయడం లేదు.
చిరు సిగ్నల్ ఇస్తే సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి ఒక కథ చెప్పాడు. కాని డైరెక్టర్ ఆయన కాకుండా మోహన్ రాజా కోసం ఆ కథ రాసారు. చిరంజీవికి కథ వినిపించి ఆయన ఓకే అంటే ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల రవి ఓ కామెంట్ కూడా చేసారు ఈ సినిమాపై. చిరంజీవి అంటే, పాటలు డాన్సులు గుర్తొస్తాయని… ఆ తరహా చిత్రాలు ఆయనే ఎన్నో చేశారని తెలిపారు. అలాగే సందేశాత్మక చిత్రాలు చేశారని చెప్పిన రవి… వాటిని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారన్నారు.
ఓ పెద్ద స్టార్ బలమైన సందేశాన్ని ఇస్తే , చాలామందికి చేరువ అవుతుందని, తాను అలాంటి కథే సిద్థం చేశానని బయటపెట్టారు. వాస్తవానికి విశ్వంభర సినిమా కంటే ముందే ఈ సినిమా మొదలుపెట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. రవి కూడా ఆ విషయంలో నమ్మకంగా ఉన్నారు. అలాగే గతంలో కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేసినా ముందుకు వెళ్ళలేదు. హరీష్ శంకర్ కూడా ఒక కథ రెడీ చేసినా ముందుకు వెళ్ళడం లేదు. హరీష్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీ అయ్యారు. మరో ఏ సినిమా చేస్తారో తెలియాల్సి ఉంది.