Open Hymer Movie: భగవద్గీతతో గేమ్స్.. హాలీవుడ్ మీద భారీగా దాడి..?

హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ లో సెక్స్ సీన్ టైంలో భగవద్గీత శ్లోకం చదవటం వివాదంగా మారింది. కాకపోతే ఈ వివాదం పుష్కర కాలం లేటైందంతే.. నిజానికి అమెరికన్ సైంటిస్ట్ అణుబాంబు పితామహుడైన ఓపెన్ హైమర్ బయోపిక్ తో లాస్ట్ వీక్ కిక్ ఇచ్చాడు క్రిస్టోఫర్ నోలాన్.

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 06:50 PM IST

బేసిగ్గానే ఇండియా అంటే ప్రత్యేక ఆసక్తి, అభిమానం ఉన్న ఈ దర్శకుడు, ఓపెన్ హైమర్ రియల్ లైఫ్ లో భగవద్గీత గురించి అన్న మాటలు రాంగ్ సీన్ లో వాడాడు. నిజానికి అణుబాంబుని విజయవంతంగా పరీక్షించాక, నౌ ఐయామ్ బికమ్ డెత్ అంటూ ఇచ్చినా స్టేట్ మెంట్ని, సెక్స్ సీన్ లో మరోలా వాడాడు క్రిస్టోఫర్ నోలాన్.

బయోపిక్ లో అలా రెండు సార్లు ఈ డైలాగ్ ఉందా, క్రియేటీవ్ ఫ్రీ డమ్ తీసుకున్నాడా అనేది అసలు చర్ఛ. ఇక నెటీజన్స్ అయితే రెండు గా చీలపోయి, హిందువులపై దాడి అని కొందరు.. దొంగలు బడ్డ ఆరునెల్లకు రియాక్ట్ అవుతున్నారని ఇంకొందరు అంటున్నారు. సెంట్రల్ మినిస్టర్ కూడా సెన్సార్ బోర్డ్ మీద యాక్షన్ ఉంటుందనగానే, ఇది మణి పూర్ అల్లర్లను డైవర్ట్ చేయటానికి వేసిన స్కెచ్ అంటున్నారు.

ఇక్కడ విచిత్రం ఏంటంటే, క్రిస్టోఫర్ నోలాన్ సినిమాలు ఎంత అద్భుతంగా ఉంటాయనుకున్నా, ఓపెన్ హైమర్ మాత్రం డాక్యుమెంటరీకి ఎక్కువ, రెగ్యులర్ సినిమాకు తక్కువ అనేస్తున్నారు. అసలు జనాలు మర్చిపోయేంతగా ఈ సినిమా సైడ్ కెళ్లిపోతుంటే, వివాదం పేరుతో ఈ మూవీకి ఫ్రీగా ప్రచారం చేస్తున్నారనే మరో బ్యాచ్ కూడా కామెంట్స్ పెంచింది.