దేవర రిలీజ్ కి ముందు రికార్డుల లిస్ట్ చూస్తే ఇది కూడా గిన్నీస్ బుక్ లో చేరిపోయేలా ఉంది. ఏదో తమాషా రికార్డులా అంటే, హాలీవుడ్ జనం కూడా చర్చించుకునే స్థాయి సెన్సేషన్స్ ని విడుదలకు ముందే క్రియేట్ చేసింది దేవర. అంతేకాదు సముద్రం అవతల ఒడ్డు ఎరుపెక్కేలా అడ్వాన్స్ బుక్కింగ్స్, ప్రివ్యూ వసూళ్లు ఉండబోతున్నాయి. మొదటి రోజు కేవలం ఇండియాలో 200 కోట్లు, ప్రపంచ వాప్తంగా 100 కోట్ల వసూళ్లకు అవకాశం ఉంది. ప్రమోషనల్ స్ట్రాటజీ బానే వర్కవుట్ అవుతున్నట్టుంది. అంతేకాదు దేవర మూవీ త్రిబుల్ ఆర్ కంటే కూడా ఎన్టీఆర్ కెరీర్ లోఎంతో ముఖ్యమైన సినిమాగా మారుతోంది. ఇంతరకెన్నడు చేయని పనులు, జరగని వింతలు దేవర విషయంలోనే జరుగుతున్నాయి.. అవేంటి?
దేవర మూవీ యూఎస్ లో రిలీజ్ కిముందే అడ్వాన్స్ బుక్కింగ్స్ రూపంలో 2 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఇదొక్కటే కాదు ఇలాంటి ఎన్నో రికార్డులు, మరెన్నో విశేషాలు దేవరగా ఎన్టీఆర్ కి సొంతమయ్యాయి. అవే ఇప్పుడు సోషల్ మీడియాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ మీద అందరి అటెన్షన్ పెరగటానికి కారణం అవుతోంది.
ఇక దేవర తాలూకు వింతలు విశేషాల మీద ఫోకస్ చేస్తే, ఆరేల్ల క్రితం అరవింద సమేత వీర రాఘవ రెడ్డి అంటూ సోలో హీరోగా వచ్చాడు ఎన్టీఆర్. ఆతర్వాత త్రిబుల్ ఆర్ లాంటి మల్టీ స్టారర్ మూవీ చేసిన తను, మళ్లీ సోలో హీరోగా ఇప్పుడే థియేటర్స్ మీద దాడి చేస్తున్నాడు
ఇక ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి తర్వాత దేవరలోనే ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేశాడు. అంటే నాలుగు సార్లు సేమ్ ఫార్ములా వాడాడు..అంతేకాదు దేవరతోనే ఫస్ట్ టైం సౌత్ కి ట్రావెల్ అయ్యింది అతిలక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ. అలా తను తంగంగా తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవల్లో వెండితెరమీద వెలగబోతోంది. ఆదిపురుష్ మూవీచేసినా కూడా సైఫ్ ఆలీఖాన్ కి దేవరనే మొదటి తెలుగు సినిమాగా గుర్తింపు దక్కుతోంది
ఇక ఎయిటీస్ లో జరిగిన కథగా దేవర పీరియాడిక్ కిక్ ఇవ్వబోతోంది. అంతేకాదు దేవర మూవీ మొత్తం నిడివి నాలుగు గంటలు వస్తే, అందులో ఒక గంట నిడివి దేవర రెండో భాగం కోసం హోల్డ్ చేశారు. అంతే దేవర పార్ట్ 2 తాలూకు 10 పర్సెంట్ షూటింగ్ అయిపోయినట్టే అని తెలుస్తోంది.
అండర్ వాటర్ ఫైట్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండటమే కాదు, ఈ సీన్స్ కోసం 50 కోట్లు ఖర్చు పెట్టి విజువల్ ఎఫెక్ట్స్ వాడారని తెలుస్తోంది. ఇక ఐదు భాషల్లో ఎన్టీఆరే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఈలోపు చుట్టమల్లే సాంగ్ వంద మిలియన్లు అంటే పదికోట్ల వ్యూస్ ని యూ ట్యూబ్ లో సొంతం చేసుకుంది. ఇక రిలీజ్ కి ముందే రెండు మిలియన్ డాలర్లు రాబట్టిన రికార్డు కూడా దేవరే సొంత చేసుకుంది. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ఐమ్యాక్స్ థియేటర్స్ లో రోజుకి 7 షోలు పడేలా విడుదలౌతున్న తొలి భారతీయ సినిమా కూడా దేవరనే. అంతేకాదు ఇండియన్ మార్కెట్ లో మొదటి రోజు 200 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా మరో వందకోట్లు మొత్తంగా 300 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయనే రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది ఈ సినిమా.