దేవర సినిమా ఇంకా విడుదల కాలేదు… కాని దేవర పార్ట్ 2 పై అప్పుడే క్లారిటీ వచ్చేసింది. పార్ట్ 1 విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ జనాల్లో ఓ రేంజ్ లో పిచ్చి ఉంది. విదేశాల్లో అయితే అసలు టికెట్ లు కూడా దొరికే పరిస్థితి కనపడటం లేదు. సినిమా హిట్ టాక్ వస్తే ఆ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అమెరికాలో అయితే ఇంకా 4 లక్షల మంది దేవర ప్రీ బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
యూకే, ఆస్ట్రేలియాలో కూడా పరిస్థితి దాదాపుగా అలాగే ఉంది. సరిగా వారం రోజులు ఉంది విడుదలకు. ఈ వారం రోజుల్లో ఎన్ని రికార్డులు బద్దలు అవుతాయో కూడా తెలియదు. ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమాపై నెగటివ్ టాక్ ఎక్కువైంది. అయినా సరే ప్రీ బుకింగ్ మార్కెట్ మాత్రం ఆగలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా బుక్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు హిందీలో కూడా భారీ బజ్ క్రియేట్ అవుతోంది. ఇదంతా మనకు తెలుసు… కాని ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పూనకాలు వచ్చే వార్త ఒకటి చెప్పాడు.
ప్రశాంత్ నీల్ తో కలిసి చేసే సినిమా షూట్ వచ్చే నెల 21 నుంచి మొదలు కానుంది. ఆ తర్వాత జనవరిలో ఎన్టీఆర్ ఆ సినిమా షూట్ లో పాల్గొంటాడు. ఈ లోపు వార్ 2 షూట్ పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత ప్రశాంత్ ప్రాజెక్ట్ పూర్తి చేసి అక్కడి నుంచి దేవర పార్ట్ 2 మొదలుపెడతాడు. అంటే వచ్చే ఏడాదే దేవర పార్ట్ 2 మొదలు అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాను ఎలా అయినా వచ్చే ఏడాది విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే వార్ 2 తో కలిపి రెండు సినిమాలు వచ్చే ఏడాది వస్తాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా, దేవర 2 సినిమాలు 2026 లో విడుదల చేస్తాడు. ఇది ప్లానింగ్… ఇది విజన్… ఎంత వరకు వర్కౌట్ అవుద్దో చూడాలి.