RRR : రెండేళ్ల త‌ర్వాత ఇప్పుడెందుకిలా.. భీమ్‌పై క్లారిటీ

తెలుగులో స్టార్ హీరోలలో (Telugu Star Heroes) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు.. వీరిద్ద‌రూ హీరోలుగా.. జ‌క్క‌న్న (SS Rajamouli) డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ప్యాన్ ఇండియా (Pan India) మూవీ ట్రిపుల్ ఆర్ (RRR) తీశారు.

తెలుగులో స్టార్ హీరోలలో (Telugu Star Heroes) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు.. వీరిద్ద‌రూ హీరోలుగా.. జ‌క్క‌న్న (SS Rajamouli) డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ప్యాన్ ఇండియా (Pan India) మూవీ ట్రిపుల్ ఆర్ (RRR) మూవీ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డుల ప్ర‌భంజ‌నం సృష్టించిన ఈ మూవీ 2022 లో ఓ అతిపెద్ద సెన్సేష‌న్.. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఇద్దరికి సమానమైన పాత్ర ఇచ్చి ఇద్దరిని సూపర్ గా హ్యాండిల్ చేశాడు రాజమౌళి.. అయిన‌ప్ప‌టికీ అప్ప‌ట్లో వీళ్ల పాత్ర‌ల‌పై కొంత మంది డిస్క‌ష‌న్స్ పెట్టారు.. దీనిపై రెండేళ్ల త‌ర్వాత ఆ పాత్ర‌ల‌పై క్లారిటీ ఇచ్చారు ఆర్.ఆర్.ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.

పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో నడిచే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraj) పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశారు.. ఒకవేళ నిజంగా అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ (Kumaram Bheem) కలిసి ఉంటే ఏం జరిగి ఉండొచ్చు అన్న ఊహ‌తో తీసిని ఈ ఫిక్షనల్ సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఇద్ద‌రూ త‌మ త‌మ పాత్రల్లో జీవించి క్రిటిక్స్ ప్ర‌శంస‌లు సైతం అందుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరో పాత్రల మీద కొందరు కావాలని చర్చలకు దారి తీశారు. ఎన్.టి.ఆర్ చేసిన భీమ్ పాత్ర చాలా తక్కువ ఉందని. రాం చరణ్ తో పోల్చితే తారక్ పాత్ర స్క్రీన్ స్పేస్ కానీ ఎలివేషన్ కానీ తగ్గించారని అన్నారు. ఫ్యాన్స్‌తో పాటు కొంత‌మంది నెటిజ‌న్లు చాలా సీరియస్ డిస్కషన్స్ నడిపించారు. .అయితే ఆర్.ఆర్.ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

సినిమాలో రామరాజు, భీమ్ పాత్రలకు సమానమైన ప్రియారిటీ ఇస్తూ సీన్స్ రాశామని. కాకపోతే నార్త్ సైడ్ రామ రాజు పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యార‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ తెలిపారు.. అక్కడ రామరాజు పాత్ర కాషాయ దుస్తులు వేసుకోగానే అతన్ని రాముడు అనుకున్నారు. అలా రాం చరణ్ పాత్ర అక్కడ హైలెట్ అయ్యింద‌న్నారు.. అయితే ఎన్.టి.ఆర్ పాత్ర చేయడం చాలా కష్టమని అన్నారు విజయేంద్ర ప్రసాద్. ఎన్.టి.ఆర్ చేసిన భీమ్ పాత్ర అమయాకమైనది. అలాంటి పాత్ర చేయడం చాలా కష్టమన్నారు.. అయితే నార్త్ సైడ్ రామరాజు పాత్రని రాముడిగా అనుకోవడం వల్ల అక్కడ రాం చరణ్ పాత్రకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. . అయితే.. ఎవ‌రెన్ని డిస్క‌ష‌న్స్ పెట్టినా.. ఎలాంటి వాద‌న‌ల‌కు తెర‌తీసినా..ప్రేక్ష‌కులు మాత్రం ఈ సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్‌గా హిట్‌గా నిలిపారు.. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ కూడా చరణ్, తారక్ ల పాత్రల్లో ఎలాంటి తేడా లేదా ఇద్దరు సినిమాకు ఈక్వల్ ఇంపార్టెన్స్ అని క్లారిటీ ఇవ్వ‌డంతో… ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మ‌రోసారి ఖుషీ అవుతున్నారు.