ఎప్పుడూ కామెడీయేనా? కాసేపు హీరోగా నటించాలన్న ఆశ ప్రతి కమెడియన్‌కూ వుంటుంది. ఈక్రమంలో అలీ.. సునీల్.. సప్తగిరి లాంటి కమెడియన్స్ హీరోయిలుగా మారారు. త్వరలో హీరోగా వస్తున్న టాప్ కమెడియన్ ఎవరో తెలుసా..వెన్నెల కిశోర్. తెలుగులో ప్రస్తుతం లీడింగ్ కమెడియన్ అంటే వెన్నెల కిషోరే. హయ్యెస్ట్ పెయిడ్ కమెడియన్ కూడా కిషోరే. ఏడాదికి 15 నుంచి 20 సినిమాతో.. ఎక్కువ మూవీస్ చేస్తోందీ ఈయనే. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న వెన్నెల కిషోర్ హీరోగా మారాడు.
ఎన్నో కోట్ల మందిని నవ్వించినా.. హీరోగా నటించకపోతే.. ఆ వెలితి కమెడియన్స్‌కు వుండిపోతుంది. అందుకేనేమో.. ఏదో ఒకసారి హీరోగా ఎంట్రీ ఇస్తారు. సుమంత్‌తో ‘మళ్లీ మొదలైంది’ తీసిన కీర్తికుమార్ ‘చారి 111’ మూవీతో వెన్నెల కిషోర్‌ను హీరోగా చూపిస్తున్నాడు. యానిమేటెడ్ వీడియోతో సినిమాను ఎనౌన్స్ చేశాడు. స్పై తెలివి తక్కువోడు.. తింగరోడుగా వుంటే ఎలా వుంటుందో.. చూపించాడు దర్శకుడు. కమెడియన్ గానే కాదు.. హీరోగా కూడా నవ్వులు పూయించనున్నాడు వెన్నెల కిషోర్.
వెన్నెల కిషోర్ హీరోగా మారి భారీ రెమ్యునరేషన్ వదిలేసుకున్నాడు. హీరోగా కంటే.. కమెడియన్‌గానే ఎక్కువ సంపాదిస్తాడు. ప్రస్తుతం వున్న కమెడియన్స్ అందరిలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్నాడు. హీరోగా సినిమాకు 40.. 50 రోజులు డేట్స్ ఇవ్వాలి. కమెడియన్‌గా తీసుకునే దానితో పోల్చుకుంటే.. హీరోగా వచ్చేది తక్కువే. హీరో అనిపించుకోవాలంటే.. మరోటి వదులుకోక తప్పలేదు.