అంతగా కొండంత రాగం తీస్తే ఏమైంది, ఎక్స్ ట్రాక్షన్ సీక్వెల్ ఎక్స్ ట్రాక్షన్ 2 డిసప్పాయింట్ చేసింది. 2020 లో వచ్చిన ఎక్స్ ట్రాక్షన్ మూవీ నిజానికి అప్పుడు భారీ బ్లాక్ బస్టర్. ఈ సినిమా వల్లే నెట్ ఫ్లిక్స్ కి కోట్లల్లో సబ్ స్క్రైబర్లు పెరిగారు. అందుకే ఈ మూవీకి సీక్వెల్ అంటే అంతకు మించేలా ఏదో జరగబోతోందనుకున్నారు.
కాని ఎక్స్ ట్రాక్షన్ 2 లో ఫైట్లు, విజువల్ ఎఫెక్ట్స్, బోల్డ్ సీన్స్ బాగున్నా, మొదటి భాగం ముందు సీక్వెల్ దిగదుడుపే అని తేలింది. ఎక్స్ ట్రాక్షన్ లో ఇండియన్ కుర్రోడిని బంగ్లా మాఫియా నుంచి కాపాడే సోల్జర్ ఫౌట్స్ ఆకట్టుకుంటే, ఎక్స్ ట్రాక్షన్ 2 లో మరదలిని కాపాడే హీరో ప్రయాణం బెడిసి కొట్టింది.
టెక్నికల్ గా, మ్యూజిక్ పరంగా ఎక్స్ ట్రాక్సన్ 2 ఓకే కాని, హాలీవుడ్ స్టాండర్ట్స్ కి తగ్గ మూవీ అనే పరిస్థితి లేదు. ఇక ఓ టీటీలో వచ్చే రెగ్యులర్ మూవీలతో పోటీ పడటంతప్ప, థియేటర్స్ లో ఆడే ఆదిపురుష్ లాంటి మూవీలకు, ఇదేం అడ్డు కాదు. ఈ మూవీకోసం థియేటర్స్ కెళ్లే జనం, ఇంటికి పరిమితమయ్యేంత కంటెంట్ ఎక్స్ ట్రాక్షన్ లో కనిపించట్లేదు. ఇది యావరేజ్ నుంచి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఎక్స్ ట్రాక్షన్ 2 కహాని.