పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh) .. లేటెస్ట్‌గా ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్ ఎన్నికల వేళ వివాదం రేపుతోంది. ఎప్పుడో మొదలైన ఈ మూవీ షూటింగ్ ముందుకు సాగడం లేదు కానీ.. రీసెంట్ గా రిలీజైన గ్లాస్ డైలాగ్ మాత్రం ఇప్పుడు రచ్చ చేస్తోంది. దీనిపై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారగా.. మరోవైపు పవన్ చెప్పిన పొలిటికల్ డైలాగులు ఆయన వీరాభిమానులకే నచ్చలేదన్న టాక్ వినిపిస్తోంది. పవన్ రాజకీయ పార్టీ జనసేన గుర్తు గ్లాస్ గురించి పవర్ స్టార్ చెప్పిన డైలాగులు నేచురల్ గా లేవని, అతికినట్లు ఉన్నాయని చెబుతున్నారు.
జనసేనాని పపన్ కళ్యాణ్ జనసేన (Jana Sena) రాజకీయ పార్టీ నడుపుతూనే మద్యమద్యలో సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంతో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాలోని చిన్న టీజర్‌ను విడుదల చేశారు. ఎన్నికల వేళ కావడంతో ఈ టీజర్ బాగా వైరల్ అవుతోంది. ఈ టీజర్‌లో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది అన్న పవన్ డైలాగ్స్‌పై రచ్చ నడుస్తోంది. జనసేన ఎన్నికల గుర్తు కూడా గాజు గ్లాసు కావడంతో ఈ డైలాగ్ వివాదం రేపుతోంది. ఎన్నికల వేళ కావాలనే ఈ డైలాగ్ విడుదల చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
నిజానికి సినిమా నుంచి గ్లింప్స్ రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. గ్లింప్స్ చూసి సంబరాలు చేసుకున్నారు. పోలీస్ ఆఫీసర్ లో పవన్ మ్యానరిజాన్ని చూసి ఊగిపోయారు. అయితే.. టీజర్ లోని డైలాగులు చాలా మంది ఫ్యాన్స్ కే నచ్చలేదంటున్నారు చాలా మంది. ఈ డైలాగులపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. డైలాగుల్లో హరీష్ శంకర్ పంచ్ మార్క్ మిస్ అయిందంటూ డై హార్డ్ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.. ఇదంతా చూసి.. హరీష్ శంకర్ బాధ భరించలేక డైలాగులు చెప్పానంటూ సాక్షాత్తూ పవనే కళ్యాణే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తానికి హరీశ్ పెట్టిన ఈ డైలాగులు పవన్ కు మంచి కన్నా చెడే ఎక్కువ చేశాయంటున్నారు ఫ్యాన్స్