Adipurush: ఆదిపురుష్‌ నుంచి అప్‌డేట్‌.. ఖుషీలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌

సినిమాను ప్రమోట్‌ చేయడంతో పాటు అవుట్‌పుట్‌ విషయంలో ఫ్యాన్స్‌ను కన్వీన్స్‌ చేయడం కూడా మేకర్స్‌ ముందున్న పెద్ద టాస్క్‌. ముఖ్యంగా రాముడికి మీసాలు ఉండటం, రావణాసురుడు స్టైలిష్‌ లుక్‌లో ఉండటం సినిమాకు పెద్ద డ్రాబ్యాక్‌గా మారింది. ఈ రెండు విషయాల్లో మేకర్స్‌ ఆడియన్స్‌ను ఎలా కన్వీన్స్‌ చేస్తారో చూడాలి.

  • Written By:
  • Publish Date - March 30, 2023 / 01:56 PM IST

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రెడీగా ఉండండి. ఆదిపురుష్‌ వచ్చేస్తున్నాడు. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్‌ సినిమా నుంచి అప్‌డేట్‌ వచ్చేసింది. సినిమా అఫిషియల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మూవీ మేకర్స్‌. టీజర్‌తో డిసప్పాయింట్‌ అయిన ఫ్యాన్స్‌ను ఈ పోస్టర్‌ కాస్త కుషీ చేసింది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. సీత పాత్రలో క్రితి సనన్‌ నటిస్తోంది. రావణాసురుడి రోల్‌ సైఫ్ అలీఖాన్‌ చేస్తున్నాడు. ఎన్నో అంచనాల మధ్య రూపొందిన ఆదిపురుష్‌ టీజర్‌ ఆడియన్స్‌ చెప్పుకోలేని రేంజ్‌లో డిసప్పాయింట్‌ చేసింది. ప్రభాస్‌, సైఫ్‌ అలీఖన్‌ లుక్స్‌ విషయంలో ఫ్యాన్స్‌ తెగ హర్ట్‌ అయ్యారు. ఏంటి ఈ సినిమా కోసమా ఇంత బిల్డప్‌ ఇచ్చారంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే జస్ట్ టీజర్‌ కోసం ఈ షూట్స్‌ చేశామని.. సినిమా మాత్రం వేరేలా ఉంటుందని మూవీ టీం కవర్‌ చేసుకునే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్‌ మాత్రం వాళ్ల మాట నమ్మలేదు. ఓం రౌత్‌ కొంపముంచేలా ఉన్నాడంటూ భయపడుతున్నారు. తన్హాజీ లాంటి ఐకానిక్‌ సినిమా ఇచ్చిన ఓం రౌత్‌ నుంచి ఇలాంటి అవుట్‌పుట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు ఆడియన్స్‌.

కానీ ఇప్పుడు రిలీజ్‌ చేసిన పోస్టర్‌.. టీజర్ కంటే కాస్త బెటర్‌ అవుట్‌పుట్‌లా అనిపిస్తుంది. ఇవాళ్టి నుంచి సినిమా ప్రమోషన్స్‌ కూడా ప్రారంభింస్తామని మేకర్స్‌ ఎనౌన్స్‌ చేశారు. ఇండియా వైడ్‌గా 5 లాంగ్వేజెస్‌లో ఆదిపురుష్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పుడు సినిమాను ప్రమోట్‌ చేయడంతో పాటు అవుట్‌పుట్‌ విషయంలో ఫ్యాన్స్‌ను కన్వీన్స్‌ చేయడం కూడా మేకర్స్‌ ముందున్న పెద్ద టాస్క్‌. ముఖ్యంగా రాముడికి మీసాలు ఉండటం, రావణాసురుడు స్టైలిష్‌ లుక్‌లో ఉండటం సినిమాకు పెద్ద డ్రాబ్యాక్‌గా మారింది. ఈ రెండు విషయాల్లో మేకర్స్‌ ఆడియన్స్‌ను ఎలా కన్వీన్స్‌ చేస్తారో చూడాలి.