వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) .. ప్రస్తుతం ఆయన యువ దర్శకుడు బాబీ (Bobby) దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు.. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ని.. సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments), శ్రీకర స్టూడియోస్ (Srikara Studios), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. భగవంత్ కేసరి లాంటి భారీ హిట్ తర్వాత వస్తున్న ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
కాగా.. ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే మరొక సినిమాను లైన్లో పెట్టడం బాలయ్యకు అలవాటు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలకృష్ణ 110 వ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్‌గా మారింది. బాబీతో మూవీ తర్వాత బాలయ్య బాబు ఏ మూవీకి ఓకే చెప్తాడా అన్న చర్చ అభిమానుల్లో విపరీతంగా నడిచింది. యాక్షన్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తో బాలకృష్ణ నెక్ట్స్ మూవీ ఉంటుందంటూ టాక్ వినిపించింది. అయితే.. ఇప్పుడు ఓ లేటెస్ట్ బజ్ బాలయ్య ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. 110వ సినిమాని బోయపాటి శ్రీనుతో చేసేందుకు బాలకృష్ణ సిద్ధం అయ్యారని ఓ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించనుందని టాక్.. దీంతో.. ఈ కాంబో మీద మంచి గురి ఉన్న నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాలయ్య కెరీర్లో మరో భారీ హిట్ ఖాయమంటూ ఈ న్యూస్‌ను వైరల్ చేస్తున్నారు.
టాలీవుడ్ (Tollywood) లో బాలయ్య- బోయపాటి (Balayya- Boyapati) కాంబోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. వీళ్లిద్దరూ కలిసారంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందే..‘అఖండ’ విజయం తర్వాత ఈ సినిమాకు బోయపాటి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ‘అఖండ 2’ (Akhanda 2)సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బోయపాటి త్వరలోనే బాలకృష్ణతో ‘అఖండ 2’ ప్లాన్ చేస్తున్నారు. అదే బాలయ్య 110 వ చిత్రంగా తెరకెక్కనుందట.. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల రాజకీయ ప్రచారానికి విరామం తీసుకోనున్నారు బాలకృష్ణ. ఇక ఎన్నికల అనంతరం బాలయ్య ‘అఖండ 2’ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే సందడి మొదలు పెట్టేశారు.