పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 ఇప్పుడు ఓ సెన్సేషన్. పుష్ప 2 కోసం బన్నీ చాలా సీరియస్ గానే వర్క్ చేసాడు. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా సరే ఫేస్ చేయడానికి ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఇక రిలీజ్ కూడా దాదాపు 12000 థియేటర్లలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇక ప్రమోషన్స్ ను ఇండియా వైడ్ గా గ్రాండ్ గా చేయడానికి వర్క్ కూడా స్టార్ట్ చేసారు. ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేయాలని మేకర్స్ కూడా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. డిసెంబర్ 5 న సినిమా రిలీజ్ అవుతుంది.
అంటే సరిగా నెల రోజులు ఉంది. ఈ నెల రోజుల్లో… ఇండియా వైడ్ గా ఈవెంట్స్ ను ప్లాన్ చేసింది పుష్ప టీం. నార్త్ ఇండియాలో అన్ని స్టేట్స్ లో ప్లాన్ చేసారు. పంజాబ్ లోని మొహాలి, రాజస్థాన్ లోని జైపూర్, గుజరాత్ లో గాంధీ నగర్, ఉత్తరప్రదేశ్ లోని లక్నో, మహారాష్ట్రలో ముంబై, మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో ప్లాన్ చేసారు. బెంగాల్, బీహార్ లో కూడా ప్లాన్ చేసినట్టు టాక్. పాట్నాలోనే ట్రైలర్ కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ఆ తర్వాత కోల్కతా ఈవెంట్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఇందుకోసం రూట్ మ్యాప్ కూడా ఫిక్స్ చేసారు.
ఈశాన్య రాష్ట్రాలు మినహా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం షూట్ చేస్తారు పుష్ప టీం. ఇక పుష్ప విషయంలో ఇప్పుడు బన్నీ ఇండియన్ క్రికెటర్స్ ను గట్టిగా వాడాలి ఆని ఫిక్స్ అయ్యాడు. రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్, అర్శదీప్ సింగ్ సహా పలువుర్ని ఇప్పటికే ఇన్వైట్ చేసినట్టు టాక్. జడేజా ఆస్ట్రేలియా టూర్ కు వెళ్ళడంతో పక్కన పెట్టినట్టు టాక్. ఈ ఈవెంట్ కు జడేజా వైఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. గాంధీ నగర్ ఈవెంట్ కు హార్దిక్ పాండ్యాను ఇన్వైట్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే ముంబైలో అజింక్యా రహానేను కూడా ఇన్వైట్ చేయడానికి రెడీ అయ్యాడు.
అలాగే సచిన్ ను కూడా ట్రై చేసినట్టు టాక్. పంజాబ్ లో చేసే ఈవెంట్ కు శిఖర్ ధావన్ ను పిలిచే ఆలోచనలో ఉన్నాడు. శిఖర్ ధావన్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇన్వైట్ చేస్తున్నారు. ఇక అమెరికాలో కూడా ఓ ఈవెంట్ చేసి దానికి క్రిస్ గేల్ ను పిలవచ్చు అని సమాచారం. బ్రావో కూడా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియా ఈవెంట్ కు మ్యాక్స్వేల్, డేవిడ్ వార్నర్ ను ఇన్వైట్ చేస్తున్నాడు. ఇలా క్రికెటర్లతో పుష్ప కోసం గ్రాండ్ గా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాడు. నార్త్ ఇండియా మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి.