Game Changer: దిల్ రాజా మజాకా.. ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్.. ఇద్దరు అరెస్ట్..

కొద్దిరోజుల క్రితం ఈ చిత్రంలోని ‘జరగండి జరగండి’ అనే పాట సోషల్ మీడియాలో లీకైంది. దీనిపై నిర్మాత దిల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్‌ క్రైమ్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

  • Written By:
  • Publish Date - November 6, 2023 / 06:07 PM IST

Game Changer: ఆర్ఆర్ఆర్ (RRR) వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్టర్ మూవీ త‌ర్వాత గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్ (RAM CHARAN) నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్‌ (Game Changer). పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ (SHANKAR) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంక‌టేశ్వర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ మీద దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ చిత్రంలోని ‘జరగండి జరగండి’ అనే పాట సోషల్ మీడియాలో లీకైంది.

Ravi Teja : మాస్ విధ్వంసం.. లావాను కింద‌కు పిల‌వ‌కు.. ఉనికి ఉండదు..!

దీనిపై నిర్మాత దిల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్‌ క్రైమ్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దీంతో కేటుగాళ్లను పట్టుకున్న పోలీసులపై మూవీ యూనిట్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. దీపావళి కానుకగా ఈ సినిమాలోని జరగండి.. జరగండి.. అనే లిరికల్ పాటను విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇటీవల ప్రకటించింది. సంగీత దర్శకుడు థమన్ అందించిన ఈ పాట సినిమాకే హైలైట్‌ కానుందని టీమ్ తెలిపింది. ఈ పాటను రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు సమాచారం. దీంతో ఈ పాట కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ మూవీలో రామ్ చరణ్ డబుల్ రోల్‌లో నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇకపోతే ‘గేమ్‌ఛేంజర్’ మొదలైనప్పటి నుంచి లీకుల బెడద తప్పడం లేదు. మూవీకి సంబంధించిన షూటింగ్ ఫోటోలు, వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Siri Hanumanthu: జబర్దస్త్ కొత్త యాంకర్‌గా సిరి హన్మంతు.. సౌమ్యను ఎందుకు తప్పించారు..?

దీంతో ఆందోళన చెందిన యూనిట్ సభ్యులు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. మూవీకి సంబంధించిన కంటెంట్‌ను కొందరు ఉద్దేశపూర్వకంగానే లీక్ చేస్తున్నారని ఫిర్యాదు నమోదైంది. ఈ మూవీకి పైరసీ సమస్యలు కూడా ఉన్నాయని యూనిట్ ఫిర్యాదులో పేర్కొనగా.. పోలీసులను లీక్ వీరులను పట్టుకున్నారు.