International Film Festival : సుకుమార్‌ కూతురుకు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు.. తండ్రిని మించిపోయిందిగా..

క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ (Director Sukumar) సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ఆలోచించడంతో.. కొత్తగా సినిమా తీయడంలో.. తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్‌ చేసుకున్నాడు.

 

 

 

క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ (Director Sukumar) సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ఆలోచించడంతో.. కొత్తగా సినిమా తీయడంలో.. తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్‌ చేసుకున్నాడు. అలాంటి సుక్కూ ఇప్పుడు.. ప్రౌడ్‌ మూమెంట్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. సుకుమార్ కూతురు సుకృతి వేణి.. అతిచిన్న వయసులోనే అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఆమె ప్రధాన పాత్రలో గాంధీ తాత చెట్టు అనే మెసేజ్‌ ఒరియెంటెడ్‌ మూవీ వచ్చింది.

ఇందులో సుకృతి వేణి (Sukriti Veni) అద్భుతమైన యాక్టింట్‌తో అలరించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు వరించింది. ఢిల్లీలో సుకృత ఈ అవార్డు అందుకుంది. ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ హైద‌రాబాద్‌లో సుక్రుత ప్రస్తుతం గ్రేడ్ 8 చదువుతోంది. సుకృత యాక్ట్ చేసిన గాంధీ తాత చెట్టు మూవీని.. గతంలో చాలా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో ప్రదర్శించారు. తొలి చిత్రంతోనే తనదైన నటనతో అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు కూడా అందుకుంది. అవార్డులు, రివార్డులు గెలుచుకుంది. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌, ఇండియ‌న్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ (International Film Festival) లో ఉత్తమ తొలి సినిమా బాల‌న‌టిగా సుకృతిని అవార్డులు వ‌రించాయి.

న్యూఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జ్యూరి బెస్ట్ ఫిలింగా, నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానూ ఎన్నో అవార్డులు అందుకుంది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణే ఉద్దేశంగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ టాకీస్ సంస్థలు నిర్మించాయి. సుకృతకు అవార్డు రావడంతో.. సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయ్.