డిస్కో డాన్స్ ర్ కి.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్…

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ మిథున్ చక్రవర్తి భారత ప్రభుత్వం సినీ ప్రముఖులకు అందించే అత్యున్నత చలనచిత్ర పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - September 30, 2024 / 02:11 PM IST

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ మిథున్ చక్రవర్తి భారత ప్రభుత్వం సినీ ప్రముఖులకు అందించే అత్యున్నత చలనచిత్ర పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ ప్రకటించారు. “మిథున్ చక్రవర్తి అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ.. భారతీయ సినిమాకి మిథున్ చక్రవర్తి గారు దిగ్గజ సేవలకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించడం గౌరవంగా ఉంది.” అంటూ పోస్ట్ చేసారు.

74 ఏళ్ల మిథున్ చక్రవర్తి అక్టోబరు 8న జరిగే జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అవార్డును అందుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను అందుకున్నారు మిథున్ చక్రవర్తి. కోల్‌కతాలో జన్మించిన మిథున్ చక్రవర్తి, 1976లో మృగయా చిత్రంతో తొలిసారిగా నటించి, ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. తహదర్ కథ (1992), స్వామి వివేకానంద (1998)లో తన పాత్రలకు మరో రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నాడు. ఆయనను “మిథున్ డా” అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు.

డిస్కో డాన్సర్ సినిమాతో మిథున్ చక్రవర్తి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. బాలీవుడ్ సినిమాల్లో డిస్కో డాన్సర్ గా కనపడిన తొలి యాక్టర్ మిథున్ చక్రవర్తి కావడం విశేషం. అగ్నిపత్, ముఝే ఇన్సాఫ్ చాహియే, హమ్ సే హై జమానా, పసంద్ అప్నీ అప్నీ’, ఘర్ ఏక్ మందిర్ మరియు కసమ్ పైడా కర్నే వాలే కీ వంటి సినిమాలతో మిథున్ చక్రవర్తి భారీ హిట్ లు కొట్టారు. అయితే ఆయన కెరీర్లో డిస్కో డాన్సర్ సినిమా మైలురాయిగా చెప్తారు అభిమానులు. ఇండియన్ సినిమాకే ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది డిస్కో డాన్సర్. ఈ సినిమా 1982లో 6.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

తమిళంలో ఆనంద్ బాబుతో పాడుమ్ వానంపాడి పేరుతో , తెలుగులో నందమూరి బాలకృష్ణతో డిస్కో కింగ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా స్ఫూర్తితో 2010లో, రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన 2010 బాలీవుడ్ సినిమా గోల్‌మాల్ 3 లో “ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్”, “యాద్ ఆ రహా హై” పాటలను రిలీజ్ చేసారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఆయన రాణించారు. 2021లో మిథున్ బిజెపిలో జాయిన్ అయ్యారు. గతంలో ఆయన తృణముల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎన్నికయ్యారు. కాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గతంలో అమితాబ్ బచ్చన్, వహీదా రెహమాన్, రేఖ, ఆశా పరేఖ్ మరియు రజనీకాంత్‌ అందుకున్న సంగతి తెలిసిందే.