Kamakshi Bhaskarla : పొలిమేర నటికి దాదా సాహేబ ఫాల్కే అవార్డు

చిన్న సినిమాలుగా వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాలిటో పొలిమేర (Polimera) కూడా ఒకటి. మొదటి భాగం ఓటీటీ (OTT) లో సూపర్ హిట్ కావడంతో… రెండో పార్ట్ గా పొలిమేర 2 (Polimera2) తెరకెక్కించారు. ఈ సినిమాని థియేటర్ లో విడుదల చేయగా… అందరినీ ఆకట్టుకుంది.

చిన్న సినిమాలుగా వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాలిటో పొలిమేర (Polimera) కూడా ఒకటి. మొదటి భాగం ఓటీటీ (OTT) లో సూపర్ హిట్ కావడంతో… రెండో పార్ట్ గా పొలిమేర 2 (Polimera2) తెరకెక్కించారు. ఈ సినిమాని థియేటర్ లో విడుదల చేయగా… అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ టీమ్ కి మరో బంపర్ గుడ్ న్యూస్ అందింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన డాక్టర్ కామాక్షి భాస్కర్ల న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మకమైన 14వ దాదా సాహెబ్ (Dada Saheb Phalke Award) ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024 (Phalke Film Festival 2024) లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రం కూడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో అధికారికంగా ఎంపికైంది. తన కృతజ్ఞతలను తెలియజేస్తూ, సినిమాలో లచ్చిమి పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల తన నటనను మెచ్చిన పొలిమేర 2 టీమ్‌కి , ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

“పొలిమెరా 2 (Ma Uri Polimera 2) లో నా నటనకు గుర్తింపు లభించిందని తెలిసి థ్రిల్‌గా ఉన్నాను. ఇప్పుడు నన్ను మరింత బాధ్యతాయుతంగా పెంచే అవార్డుకు జ్యూరీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా సమాహార థియేటర్ నుండి నా గురువు రత్న శేఖర్ గారికి, యాక్టింగ్ కోచ్ నీరజ్ కబీ సర్‌కి ధన్యవాదాలు. ప్రేక్షకులు తమ ప్రేమను, అభిమానాన్ని చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను’ అని కామాక్షి అన్నారు.

‘మా ఊరి పొలిమేర 2’లో తన పాత్రను పోషించడానికి చేసిన కృషిని, ప్రయత్నాలను కామాక్షి గుర్తు చేసుకున్నారు. “సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం కానీ అవార్డులు వస్తాయని ఊహించలేదు. సినిమాలో సమిష్టి బృందం పని చేయడం వల్లనే నేను అవార్డులు గెలుచుకున్నాను. మేము ఒక టీమ్‌గా ఇంత దూరం వచ్చాము. ఇతర భాషల ప్రేక్షకులు కంటెంట్‌ని ఎలా ఆదరిస్తున్నారనేది చూడటం చాలా సంతోషాన్ని కలిగించింది.’’ అని ఆమె అన్నారు.