Kalki : పండ‌గ చేసుకుంటున్న డార్లింగ్ ఫ్యాన్స్‌

పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) .. ఇండియన్ మైథలాజికల్ కాన్సెప్ట్ తో స్కైఫై జానర్ లో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) .. ఇండియన్ మైథలాజికల్ కాన్సెప్ట్ తో స్కైఫై జానర్ లో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్. టీజర్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమా సంబంధించి వస్తున్న అప్డేట్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ‘కల్కి’ నుంచి పోస్టర్స్ తో పాటు గ్లింప్స్ మూవీపై అంచనాలను స్కైహైకి పెంచేశాయి. మేకర్స్ బుజ్జి ప్రోమోని రిలీజ్‌ చేశాక ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా నెట్టింట క్షణాల్లో ట్రెండ్ అవుతోంది.. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తుండ‌గా ఈ మూవీ ట్రైల‌ర్‌కి సంబంధించి లేటెస్ట్ బ‌జ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

క‌ల్కి మూవీని జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను కూడా స్పీడ్ చేశారు.. ఇందులో భాగంగా ట్రైలర్ ను జూన్ 7, 2024 న రిలీజ్ చేయనున్నట్లు ఫిలింన‌గ‌ర్‌లో ఓ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది.. దీంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటారు.. జూన్ 7న రికార్డుల ఊచ‌కోత ఖాయ‌మంటున్నారు.. అయితే.. జూన్ 7న క‌ల్కి ట్రైల‌ర్ రిలీజ్‌పై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

దీపికా పదుకునే, దిశా పటాని లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల విడుదలైన బుజ్జి వీడియో అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఈ సినిమా కోసం బుజ్జి పేరుతో ఒక ఫ్యూచరిస్టిక్ కారు డిజైన్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ కారు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.