Director Srikanth: అక్కినేని కాంపౌండ్‌లోకి దసరా డైరెక్టర్‌

డెబ్యూ మూవీతోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీకాంత్‌ ఓదెల ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌ లైన్‌లో పెట్టాడు. ఏకంగా అక్కినేని కాంపౌండ్‌లో అడుగుపెట్టి లక్కీ చాన్స్‌ కొట్టేశాడు. త్వరలోనే ఈ యంగ్‌ డైరెక్టర్‌ అక్కినేని అఖిల్‌లో సినిమా చేస్తున్నట్టు సమాచారం.

  • Written By:
  • Publish Date - April 4, 2023 / 02:00 PM IST

శ్రీకాంత్‌ డైరెక్షన్‌లో వచ్చిన దసరా సినిమా రీసెంట్‌ పెద్ద సినిమాలూ కూడా రాబట్టలేని కలెక్షన్స్‌ను తెచ్చుకుంది. అంచనాలను మించి బాక్సాఫీస్‌ను ఊచకోత కోసింది. రాజమౌళి లాంటి డైరెక్టర్‌ కూడా శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌కు ఫిదా ఐపోయాడు. ప్రభాస్‌, మహేష్‌ బాబు కూడా శ్రీకాంత్‌ను ఆకాశానికెత్తేశారు. డెబ్యూ సినిమాతోనే ఇలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీకాంత్‌ ఓదెల ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయాడు. ఇప్పుడు అందరి చూపు శ్రీకాంత్‌ చేయబోయే నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ మీదే ఉంది.

ప్రస్తుతం దసరా సక్సెస్‌ను ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్న ఈ డైరెక్టర్‌.. తరువాత సినిమా అక్కినేని అఖిల్‌తో ప్లాన్‌ చేస్తున్నాడట. దీనికోసం ఇప్పటికే ఓ కథ కూడా అఖిల్‌కు చెప్పాడట శ్రీకాంత్‌. ఆ కథకు ఓకే చెప్పిన అఖిల్‌.. ఫైనల్‌ స్క్రిప్ట్‌ రెడీ చేమయని శ్రీకాంత్‌ కు చెప్పాడట. ఇప్పడు ఈ స్క్రిప్ట్‌ పూర్తి చేసే పనిమీదే ఫోకస్‌ చేస్తున్నాడు శ్రీకాంత్‌. త్వరలోనే దీనిపై అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ రానున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో ఏజెంట్‌ సినిమా చేస్తున్నాడు అఖిల్‌. పాన్‌ ఇండియా లెవెల్‌లో ప్లాన్‌ చేస్తున్న ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలున్నాయి. ఫుల్‌ లెంత్‌ యాక్షన్‌ మూవీగా వస్తున్న ఏజెంట్‌ సినిమాలో అఖిల్‌ బీస్ట్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్‌, ఫస్ట్‌ లుక్‌కు ఆడియన్స్‌ నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చింది. ఏజెంట్‌ సినిమా తరువాత శ్రీకాంత్‌తో సినిమాను స్టార్ట్‌ చేయబోతున్నాడట అఖిల్. ఇదే నిజమైతే శ్రీకాంత్‌ అఖిల్‌ను ఏ రేంజ్‌లో ప్రజెంట్‌ చేస్తాడో చూడాలి.