Dasara Review: పండగ లేని దసరా!?

తన మార్క్ యాక్టింగ్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్‌ చేసుకున్నాడు నాని. టైర్‌ 2 హీరోల్లో టాప్‌లో ఉంటున్నాడు. నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అంటే సుందరానికి అంటూ ఇంతకుముందు పలకరించిన నాని.. కాస్త నిరాశపరచడంతో.. దసరా మీద అంచనాలు పెరిగిపోయాయ్.

  • Written By:
  • Updated On - March 30, 2023 / 12:17 PM IST

తన మార్క్ యాక్టింగ్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్‌ చేసుకున్నాడు నాని (Nani). టైర్‌ 2 హీరోల్లో టాప్‌లో ఉంటున్నాడు. నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అంటే సుందరానికి (Ante Sundaraniki) అంటూ ఇంతకుముందు పలకరించిన నాని.. కాస్త నిరాశపరచడంతో.. దసరా (dasara) మీద అంచనాలు పెరిగిపోయాయ్. టీజర్, ట్రైలర్‌ మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేయడంతో.. నాని ఏదో పెద్ద మ్యాజిక్‌ చేయబోతున్నాడనే అంచనాలు పెరిగిపోయాయ్. మరి అభిమానుల అంచనాలను నాని అందుకున్నాడా.. దసరా మూవీ టీమ్‌కు పండగ తీసుకువచ్చిందా.. నానిని దసరా గట్టెక్కించిందా…?

ఈ మధ్య పెద్ద సినిమాలేవీ లేకపోవడం.. తెలంగాణ స్లాంగ్‌తో (Telangana Slang) వస్తున్న సినిమాలకు మంచి డిమాండ్ ఉండడం.. టీజర్, ట్రైలర్ ట్రెండ్ సెట్‌ చేయడం.. చమ్కీల అంగీ (chamkila angi song) సాంగ్‌ బజ్ క్రియేట్ చేయడంతో.. దసరా సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయ్. కేజీఎఫ్‌ను కొట్టేస్తుంది.. మరో బాహుబలి బాంచాత్‌.. పుష్ప టు పాయింట్ ఓ అంటూ.. మూవీ టీమ్ ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు.

ఐతే ట్రైలర్‌లో కనిపించిన వేడి, స్పీడ్‌.. సినిమాలో కనిపించలేదు. ఓపెన్‌ చేయగానే.. స్లోగా సాగుతుంది సినిమా. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్లు, క్లైమాక్స్‌ తీసేస్తే.. అబ్బా అనుకునే మూమెంట్‌ ఒక్కటి కూడా లేదు. అర అడుగు.. ఫుల్ అడుగు అంటూ ఇంటర్వ్యూల్లో ఊదరగొట్టిన టీమ్‌.. సరైన అడుగులు వేయడంలో ఫెయిల్ అయింది. సెకండాఫ్‌లో.. ఓ టైమ్‌లో నీరసం వచ్చేస్తోంది ప్రేక్షకులకు! సాగతీసి.. సాగతీసి.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు అనిపించింది. క్లైమాక్స్‌ ఫైట్‌ అదుర్స్ అనిపించినా.. అప్పటికే నీరసంతో ఉన్న ఆడియెన్స్‌లో చాలామందికి అది ఎక్కడం లేదు.

కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నా.. వాటిని ఎలివేట్ చేయడంలో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ సరిగా పడలేదు. పాటల మీద పెట్టిన దృష్టి.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రీరికార్డింగ్‌ మీద పెట్టినట్లు అనిపించలేదు. మాస్‌ సీన్లు కళ్ల ముందు కనిపిస్తుంటే.. వాటిని మరింత ఎత్తుకునేలా బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ వినిపించలేదు. ఆ సింథటిక్ మట్టిలో.. హీరో, ఫ్రెండ్‌ కేరక్టర్ పడిన కష్టానికి మాత్రం స్పెషల్ మార్కులు వేయాలి. ఇంటర్వెల్‌ ట్విస్ట్ మాత్రం సినిమాకు పీక్స్‌.

ఓవరాల్‌గా దసరా యావరేజిగా నిలిచింది. కేజీఎఫ్‌ను కొడుతుందని.. బాహుబలి, ట్రిపుల్‌ఆర్‌ తర్వాత ఇదే సినిమా అని బిల్డప్ ఇవ్వడం కాదు.. ఆ రేంజ్ కంటెంట్ ఉందా.. గ్రిప్పింగ్ ఉందా అని చూసుకోవాలి బ్రో ! ఓవరాల్‌గా దసరా పండగకు పేలీ పేలనట్లు పేలిన లక్ష్మీబాంబ్‌గా మిగిలింది దసరా మూవీ.