David Warner: గంగమ్మ తల్లి గెటప్‌లో డేవిడ్‌ వార్నర్‌.. పుష్ప 2లో రోల్‌ చెయ్యాలని ఫ్యాన్స్‌ డిమాండ్‌..

డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి అదరగొట్టాడు. గంగమ్మతల్లి గెటప్‌లో వచ్చిన అల్లు అర్జున్‌ పోస్టర్‌ను తన ఫేస్‌తో ఎడిట్‌ చేసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. పనిలో పనిగా దీన్ని క్రెడ్‌ యాప్‌ ప్రమోషన్స్‌కు కూడా వాడుకున్నాడు. యూపీఐలో అల్లు అర్జున్‌కు డబ్బులు పంపి.. ఆ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేశాడు. మేక్‌ దిస్‌ హ్యాపెన్‌ మచ్చా అంటూ తనకూ బన్నీకు ఉన్న ఫ్రెండ్‌షిప్‌ను మరోసారి గుర్తు చేశాడు.

  • Written By:
  • Publish Date - April 21, 2023 / 02:51 PM IST

ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే వార్నర్‌ రెగ్యులర్‌గా రీల్స్‌ చేస్తుంటాడు. అల్లు అర్జున్‌ బుట్టబొమ్మ సాంగ్‌కు, తగ్గేదే లే అనే రీల్స్‌కు వార్నర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. కొందరైతే వార్నర్‌కు ఇండియాలో ఆధార్‌ కార్డ్‌ కూడా ఇవ్వాలంటూ తెగ కామెంట్లు పెట్టారు. ఇలా తెలుగు రీల్స్‌తో తెలుగు ఆడియన్స్‌కు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఎంతో క్లోజ్‌ అయ్యాడు వార్నర్‌. హైదరాబాద్‌ టీంలో ఆడుతున్నాడు కాబట్టే తెలుగు రీల్స్‌ చేస్తున్నాడని కొందరు విమర్శించారు.

కానీ ఇప్పుడు ఢిల్లీ టీంను రీప్రజెంట్‌ చేస్తున్నా తెలుగు రీల్స్‌ను మాత్రం విడిచిపెట్టలేదు వార్నర్‌. తనకు ఇండియా అంటే చాలా ఇష్టమని, ఇండియా తనకు సెకండ్‌ హోమ్‌ లాంటిదని వార్నర్‌ చాలా సార్లు చెప్పాడు. మాటకు తగ్గట్టుగానే తెలుగు రీల్స్‌తో ఎప్పటికప్పుడు తెలుగు ఆడియన్స్‌ను ఎంటర్టైన్‌ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా గంగమ్మ తల్లి గెటప్‌లో మరోసారి ఆడియన్స్‌ను అలరించారు. ప్రస్తుతం వార్నర్‌ గెటప్‌ ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతోంది. దీంతో పుష్ప 2లో వార్నన్‌కు ఓ కేమియో ఇవ్వాలంటూ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. వార్నర్‌ పోస్ట్‌పై పుష్ప మేకర్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.