అసలు రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు (Mahesh Babu) ప్రాజెక్ట్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? అసలేం జరుగుతోంది? అనే విషయాల్లో ఎలాంటి క్లారిటీ లేదు. రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరు కూడా సినిమా చేస్తున్నామని చెబుతున్నారు తప్పితే.. ఫలానా రోజు లాంచింగ్ ఉంటుంది, షూటింగ్ ఫలానా రోజు ఉంటుంది. అనే విషయాలు మాత్రం చెప్పడం లేదు. పోనీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది.. స్టార్ క్యాస్టింగ్ ఎవరు అనేది కూడా ఎక్కడా రివీల్ చేయడం లేదు.
ఇదంతా పక్కన పెట్టేసి.. మహేష్, జక్కన్న మాత్రం మిగతా పనులతో బిజీగా ఉన్నట్టే ఉంది. మహేష్ ఫ్యాన్స్ అయితే.. సినిమా తీయమంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29) గురించి ఎలాంటి అప్టేడ్స్ ఇవ్వడం లేదు గానీ.. ఇద్దరు మాత్రం యాడ్స్ చేస్తున్నారు. ఆ మధ్య మహేష్ బాబు వరుస యాడ్స్ చేశాడు. ఇక ఇప్పుడు రాజమౌళి నుంచి ఊహించని యాడ్ ఒకటి వచ్చింది. క్రికెటర్ (Cricketer) డేవిడ్ వార్నర్ (David Warner)తో ఒక కొత్త యాడ్ చేశాడు రాజమౌళి. యూపిఐ పేమెంట్స్ (UPI Payments) లో భాగంగా క్రెడ్ క్రెడిట్ కార్డ్ యాప్ కోసం ఇద్దరు కెమెరా ముందు కనిపించారు
ఆస్కార్ విన్నింగ్ దర్శకుడితో డేవిడ్ వార్నర్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. మామూలుగానే వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లో చేసే వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పుష్ప సినిమాలో బన్నీ మ్యానరిజంతో తగ్గేదేలే అంటు ఉంటాడు. ఇక ఇప్పుడు రాజమౌళితో యాడ్ చేసి వైరల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ అవుతోంది.