తల్లి తండ్రులైన దీపిక – రణవీర్, కూతురికి ఆ పేరే పెడతారా…?

బాలీవుడ్ స్టార్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆదివారం ఈ ఇద్దరికీ ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆడబిడ్డ పుట్టినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. ఇప్పుడు వీరి పాపకు ఏం పేరు పెడతారు అనేది ఆసక్తిగా మారింది.

  • Written By:
  • Updated On - September 8, 2024 / 03:31 PM IST

బాలీవుడ్ స్టార్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆదివారం ఈ ఇద్దరికీ ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆడబిడ్డ పుట్టినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. ఇప్పుడు వీరి పాపకు ఏం పేరు పెడతారు అనేది ఆసక్తిగా మారింది. స్టార్ జంటలు అందరూ తమ బిడ్డలకు పెట్టె పేర్లు ఈ మధ్య కాస్త భిన్నంగా ఉంటున్నాయి. ఈ ఇద్దరూ అదే ట్రెండ్ ఫాలో అవుతారని అందరూ భావిస్తున్నారు. అసలు ఏం పేరు పెట్టె అవకాశం ఉందనే దానిపై కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

తాను హోస్ట్ గా పాల్గొనే ది బిగ్ పిక్చర్ ఎపిసోడ్ లో రణవీర్ తనకు పుట్టబోయే బిడ్డ కోసం పలు పేర్లను రెడీ చేసుకున్నట్టుగా బయటపెట్టాడు. శౌర్యవీర్ అనే కంటెస్టెంట్‌తో మాట్లాడిన రణ్‌వీర్, తనకు బిడ్డ ఉంటే వారి పేరును పెట్టేందుకు వారిని అడిగాడు. పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తున్నాను… శౌర్య వీర్ సింగ్ అనే పేరు తీసుకుంటే మీకు ఏమైనా అభ్యంతరమా అని ప్రశ్నించాడు. ఆ పేరు అబ్బాయిది కావడంతో ఇప్పుడు ఆ పేరుని పెట్టే అవకాశం లేకపోవచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు పెళ్ళైన చాన్నాళ్ళ తర్వాత తల్లి తండ్రులు కావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

2022లో తన చిత్రం జయేష్‌ భాయ్ జోర్దార్ ప్రమోషన్‌ కార్యక్రమాల సందర్భంగా, రణ్‌వీర్‌కు మగబిడ్డ లేదా ఆడపిల్ల కావాలా అని అడిగిన ప్రశ్నకు… తనకు ఏ బిడ్డ కావాలి అనే దానిపై పట్టింపు లేదు అన్నాడు. గుడికి వెళ్ళినప్పుడు, నీకు లాడూ కావాలా, షీరా కావాలా అని అడగరు అలాగే మీకు ఏది లభించినా, అది ప్రసాదం కాబట్టి మీరు దాన్ని పూర్తి భక్తితో తీసుకుంటారు. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది అంటూ సమాధానం ఇచ్చాడు. కాగా శనివారం వినాయకుడి పూజ నిర్వహించిన అనంతరం ఈ జంట రిలయన్స్ ఆస్పత్రికి చేరుకుంది.