అప్పుడప్పుడు స్టార్‌ని బట్టి, ప్రాజెక్ట్‌ని బట్టి రెమ్యునరేషన్ ఎక్కువైనా ఇచ్చేందుకు రెడీ అవుతుంటారు ప్రొడ్యుసర్స్. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే విషయంలో కూడా ఇదే జరిగింది. శింభు హీరోగా కమల్ హాసన్ డైరెక్టర్‌గా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శింభు పక్కన హీరోయిన్గా చేసేందుకు దీపికా పదుకుణెను అనుకున్నారట. వెంటనే ఆమె మేనేజర్‌ను సంప్రదించడంతో ఆమె అడిగిన రెమ్యునరేషన్ చూసి ప్రొడ్యూసర్లకు దిమ్మతిరిగిపోయిందట.
ప్రాజెక్ట్ ఓకే చేసేందుకు ఏకంగా 30 కోట్లు రెమ్యునరేషన్ అడిగిందట దీపికా. అంతే కాదు.. షూటింగ్ టైంలో తాను స్టే చేసేందుకు స్టార్ హోట్‌లో ఓ ఫ్లోర్ మొత్తం బుక్ చేయాలని చెప్పిందట. దీపికా రిక్వైర్మెంట్ విన్న ప్రొడ్యూసర్లు వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఈ సినిమానే కాదు.. ప్రభాస్ నాగ్అశ్విన్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్-కే సినిమాకు కూడా దీపికా 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు మరోసారి సేమ్రెమ్యునరేషన్ డిమాండ్ చేసి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది దీపికా. ఈ ఇష్యు ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. దీపికాకు ఇంత రెమ్యునరేషన్ అవసరమా అంటున్నారు నెటిజన్లు.