ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ దీపిక పదుకునే. సినిమాకు 12 నుంచి 15 కోట్లు తీసుకుంటోంది. అందిరిలాగానే యాడ్స్ ఎలాగూ వున్నాయి. అయితే.. ఏకంగా యాడ్‌ను మెడపై టాటూ వేసుకుని తిరుగుతోంది దీపిక. ఎందుకిలా చేసిందో తెలిస్తే.. దీపిక ఎంత ముదురో అర్థం అవుతుంది
ఆస్కార్ వేదికపై దీపిక పదుకునే డ్రెస్ గురించి పెద్ద చర్చే అయింది. అందరీ లుక్స్ అదిరేటి డ్రస్‌పై పైనే. నల్లటి రంగు గౌనుతో అందాలు ఆరబోస్తే.. మెడపై ’82 డిగ్రీస్ E’ అన్న టాటూ కనిపించింది. ఈ టాటూకు అర్థం ఏమిటో ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు.
దీపిక సొంత స్కిన్ కేర్ బ్రాండ్ పేరే ’82 డిగ్రీస్ E’. తన బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవడానికి మెడపై టాటూ వేయించుకుంది. ఆస్కార్ వేదికపై తన బ్రాండ్‌కు ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చుకుంది. ఆస్కార్ టైంలో యాడ్ ఇవ్వాలంటే 30 సెకన్లకు గాను 2 మిలియన్ డాలర్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో 16 కోట్ల 39 లక్షలతో సమానం. ఇవేవీ చెల్లించకుండా.. టాటూతో కొన్ని నిమిషాలపాటు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. ఈలెక్కన కొన్ని వందల కోట్ల ఖర్చు లేకుండా… చిన్న టాటూతో అందరి దృష్టి తన ప్రొడక్ట్ పై పడేలే చేసింది.
ఇలా ఆస్కార్ వేదికపై తన బ్రాండ్‌కు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చుకుని.. మంచి బిజినెస్‌ఉమెన్ అనిపించుకుంది దీపిక. తొలి రౌండ్ ప్రజెంటర్స్‌లో తన స్పీచ్‌ను కొనసాగించి వేడుకు వచ్చిన ప్రముఖులకు నాటు నాటు పాటను పరిచయం చేసింది దీపిక. పఠాన్‌తో అదిరిపోయే హిట్ అందుకున్న దీపిక ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె మూవీ చేస్తోంది.