Deepika Padukone: కల్కి 2898 ఏడీ మూవీ మే 9న రావటం పక్కా అయ్యింది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బాగోలేకపోతే రిపేర్లు చేస్తారు. దాంతో విడుదల వాయిదా అన్నారు. కాని గ్రాఫిక్స్ పనులను చూసి సంతృప్తి చెందిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి రిలీజ్ పనులు షురూ చేశాడు. కాబట్టి, కల్కి వాయిదా పడే ఛాన్సే లేదు. కాకపోతే ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతోంది. ఇంతలో కొత్త టెన్షన్ షురూ అవుతోంది. పెండింగ్ సాంగ్ షూటింగ్ పూర్తికావొచ్చిన టైంలో, దీపికా పదుకొనే కల్కి టీం కి హ్యాండ్ ఇస్తోంది.
Ram Charan: జరగండి.. వస్తున్నాడు..! చరణ్ ఫ్యాన్స్‌కు థమన్ గుడ్ న్యూస్
కల్కి రిలీజ్‌కి ఇంకా రెండునెలలు కూడా టైం లేదు. అలాంటిది ఇప్పుడు ప్రమోషన్ పెంచాల్సిన టైంలో దీపికా పదుకొనే నో చెబుతోంది. తను కల్కి ప్రమోషన్‌కి దూరంగా ఉండబోతోంది. కారణం తను తల్లవ్వబోతుండటమే. ప్రెగ్నెంట్ అయిన తను సెప్టెంబర్‌లో ప్రసవించబోతోంది. పెళ్లైన 5 ఏళ్లకు తల్లైన దీపికా, ఇంటి పట్టునే ఉండోబోతోందట. ప్రెగ్నెంట్‌గా ఉన్నటైంలో ప్రయాణాలు చేయకూడదు కాబట్టి, కల్కి ప్రమోషన్ కోసం రాష్ట్రాలు తిరగటం తన వల్ల కాదు. అదే విషయం తేల్చేసిన తను, కొత్త సినిమాలకు సంతకం చేయటం ఆపేసింది.
కాకపోతే కల్కి 2 లో జాయిన్ అవుతానన్న దీపికా, వచ్చే నెల నుంచి పూర్తిగా ఇంటికే పరిమితం కాబోతోంది. సెప్టెంబర్‌లో డెలివరి అయినా మూడునెలలు కొన్ని ఫార్మాలిటీస్ కోసం కేటాయించబోతోంది. తల్లిగా కనీసం పాపతో ఏడాది టైం స్పెండ్ చేశాకే మళ్లీ సినిమాల్లోకి వస్తుందట. కాబట్టి అప్పటి వరకు దీపిక.. సినిమాలకు దూరంగా ఉండనుంది.