Deepika Padukone: రామ్ చరణ్‌‌ను రిజెక్ట్ చేసిన దీపికా.. ఏ సినిమానో తెలుసా..

చరణ్‌లోని అసలైన నటున్ని బయటకు తెచ్చిన సినిమా రంగస్థలం అనే చెప్పాలి. ఇక కెరీర్ స్టార్టింగ్‌లో చిరుత, మగధీరతో అదరగొట్టేశాడు చరణ్. అలాంటి చరణ్‌ను ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేయడం విశేషం.

  • Written By:
  • Publish Date - January 21, 2024 / 12:56 PM IST

Deepika Padukone: ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజమౌళి.. ఎన్టీఆర్‌కు అన్యాయం చేశాడు అని నందమూరి ఫ్యాన్స్ తెగ బాధపడిపోయారు. ఎదుకంటే.. క్లైమాక్స్‌లో రామ్ చరణ్‌ను అల్లూరి సీతారామరాజుగా చూపించడంతో.. థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు రామ్ చరణే సినిమాలో హీరో అని అనిపిస్తుంది. అలాగే.. చరణ్ ఇంట్రో ఫైట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు చరణ్ కూడా యాక్టింగ్ ఇరగదీశాడు.

Ramcharan: రామ్ చరణ్‌ కారును వెంబడించిన అభిమానులు.. షాక్‌ ఇచ్చిన చెర్రీ!

కానీ చరణ్‌లోని అసలైన నటున్ని బయటకు తెచ్చిన సినిమా రంగస్థలం అనే చెప్పాలి. ఇక కెరీర్ స్టార్టింగ్‌లో చిరుత, మగధీరతో అదరగొట్టేశాడు చరణ్. అలాంటి చరణ్‌ను ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేయడం విశేషం. ఇప్పుడంటే చరణ్‌తో సై అనడానికి బాలీవుడ్ బ్యూటీస్ తహతహలాడుతున్నారు కానీ.. గతంలో మాత్రం అలా లేదు పరిస్థితి. నాయక్ వంటి సినిమాతో తెలుగులో హిట్ జోష్‌లో ఉన్న చరణ్.. ఆ తర్వాత బాలీవుడ్‌లో లక్ చెక్ చేసుకోవడానికి.. 2013లో అమితాబచ్చన్ నటించిన జంజీర్ సినిమాని హిందీలో రీమేక్ చేశాడు. ఈ సినిమాను తెలుగులో తుఫాన్ అనే పేరుతో రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటించింది. కానీ.. అంతకంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక పదుకొణేను అనుకున్నారట. ఆమెని సంప్రదించగా రామ్ చరణ్‌తో నటించనని చెప్పేసిందట. దాంతో ప్రియాంక చోప్రాని హీరోయిన్‌గా తీసుకున్నారట. ఏదేమైనా.. ఇప్పుడు దీపికకు చరణ్‌తో నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకునే ఛాన్స్ లేదనే చెప్పాలి.