FIGHTER: గ్రీక్ గాడ్‌ని కాపాడిన బంగారు లేడీ..

ఎలాగైతే పటాన్ ప్లాప్ అన్నాక కూడా వెయ్యికోట్లు వచ్చాయో.. జవాన్‌లో సోది తప్ప ఏం లేదన్నా కూడా అది థౌజెండ్ వాలాగా మారిందో.. అచ్చంగా అలానే ఫైటర్‌కి వసూళ్ల వరద పెరిగింది. ఇక్కడ ఇదే విచిత్రం. సినిమా టాక్ బాలేదు.

  • Written By:
  • Publish Date - January 26, 2024 / 05:56 PM IST

FIGHTER: దీపికా పదుకొనే బంగారు గుడ్లు పెట్టే బాతో, బంగారులేడీలా బాక్సాఫీస్‌ని షేక్ చేసే బాపతో కానీ.. తన వల్ల బాలీవుడ్ గ్రీక్ గాడ్ ఫేట్ మారింది. గత కొన్నేళ్లుగా సోసో సక్సెస్‌తో సరిపెట్టుకున్నాడు హృతిక్ రోషన్. వార్, విక్రమ్ వేద రెండూ కూడా జస్ట్ యావరేజ్ హిట్లే. కాని ఫైటర్ మాత్రం గ్రాండ్ హిట్ అనేస్తున్నారు. అలాగని రివ్యూలు, పబ్లిక్ టాక్ బాగుందా అంటే, అస్సలు బాలేదు.

Jr NTR-RAM CHARAN: రాజమౌళి ఈ ఇద్దరికీ హిట్ ఇచ్చినా ఫేట్ మాత్రం డౌట్‌లోనే..?

కాని కలెక్షన్స్ వస్తున్నాయి. ఎలాగైతే పటాన్ ప్లాప్ అన్నాక కూడా వెయ్యికోట్లు వచ్చాయో.. జవాన్‌లో సోది తప్ప ఏం లేదన్నా కూడా అది థౌజెండ్ వాలాగా మారిందో.. అచ్చంగా అలానే ఫైటర్‌కి వసూళ్ల వరద పెరిగింది. ఇక్కడ ఇదే విచిత్రం. సినిమా టాక్ బాలేదు. రివ్యూలు బాలేవు. అయినా పటాన్, జవాన్ హిట్టయ్యాయి. అలానే ఫైటర్‌కి వసూళ్లు వస్తున్నాయి. ఏంటా కారణం అంటే దీపికా అదృష్టమే అంటున్నారు. నిజమే.. ఈ మూడు సినిమాల్లో కామన్‌గా ఏదైనా ఉందంటే, ఈ హీరోయిన్ కటౌటే. పటాన్, జవాన్ రెండూ వెయ్యికోట్ల సినిమాలే. ఫైటర్ కూడా జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా, వసూళ్లు ఓరేంజ్ లోపెరిగిపోతున్నాయి.

అందుకే దీపికని అంతా లక్కీ లేడీ అంటున్నారు. తను కల్కీలో మెరుస్తోంది. కాబట్టి తన అదృష్టం రెబల్ స్టార్‌కి కలిసొచ్చే చాన్స్ ఉందంటున్నారు. ప్రభాస్‌కి తన కష్టం వల్ల దక్కే అదృష్టానికి కొదువేం లేదు. కానీ, తనకి మరొకరి అదృష్టం తోడైతే ఆ కిక్కే వేరనే మాట వినిపిస్తోంది.