Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ వీడియోపై కేసు.. మెటాని వివరాలు కోరిన ఢిల్లీ పోలీసులు..

రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోను రూపొందించిన అకౌంట్‌కి సంబంధించి URL వివరాలను తెలపాలని సోషల్ మీడియా దిగ్గజం మెటాను కోరారు. వీడియో తయారు చేసి అప్‌లోడ్ చేసిన అకౌంట్ URL IDని యాక్సెస్ చేయడానికి మెటాకు లేఖ రాసినట్టు పోలీసులు తెలిపారు.

  • Written By:
  • Publish Date - November 11, 2023 / 06:51 PM IST

Rashmika Mandanna: నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వివాదంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రిటిష్-ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్ జరా పటేల్ బ్లాక్ డ్రెస్సులో లిఫ్టులోకి ప్రవేశించే వీడియోని డీప్‌ఫేక్ వీడియోగా రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. ఈ వీడియోపై బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాలీవుడ్, టాలీవుడ్ సహా చాలామంది నటులు రష్మికకు మద్దతుగా నిలిచారు.

Kanguva: కంగువా రిలీజ్ డేట్ ఫిక్స్.. కమల్‌కు షాక్..

ఈ వ్యవహారంపై కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. డీప్‌ఫేక్ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఐటీ నిబంధనల ప్రకారం, కేసులు పెడితే పరిష్కారం లభిస్తుందన్నారు. తప్పుడు సమాచారం విస్తరించకుండా అడ్డుకోవడం ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంల చట్టపరమైన బాధ్యత అని కూడా రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. యూజర్స్, ప్రభుత్వ అథారిటీ నుంచి నివేదికలు అందిన 36 గంటల్లో అలాంటి కంటెంట్‌ను తీసేయాలని మంత్రి తెలిపారు. ఒకవేళ అలా జరక్కపోతే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐటీ చట్టంలోని రూల్ 7 ప్రకారం బాధితులైన వ్యక్తులు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది. రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోను రూపొందించిన అకౌంట్‌కి సంబంధించి URL వివరాలను తెలపాలని సోషల్ మీడియా దిగ్గజం మెటాను కోరారు.

వీడియో తయారు చేసి అప్‌లోడ్ చేసిన అకౌంట్ URL IDని యాక్సెస్ చేయడానికి మెటాకు లేఖ రాసినట్టు పోలీసులు తెలిపారు. ఐపీసీ 1860లోని సెక్షన్లు 465 (ఫోర్జరీ), 469 (పరువుకు హాని కలిగించడం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్లు 66C (ఐడెంటిటీ థెఫ్ట్), 66E (గోప్యతా ఉల్లంఘన) కింద ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ ఈ వీడియో తయారు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు నోటీసులు పంపింది. నటి రష్మిక కూడా ఈ వీడియోపై ఆందోళన వ్యక్తం చేసింది. చదువుకునే రోజుల్లో ఇలాంటి వీడియో వచ్చి ఉంటే తన పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకుంటేనే భయం వేస్తోందన్నారు రష్మిక.