దేవర+సాహో కలిపితే 829 కోట్లు… అంతా కార్పోరేట్ లెక్కలా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర లైఫ్ టైం వసూళ్లు 510 కోట్లు... రెబల్ స్టార్ ప్రభాస్ వసూళ్లు 350 కోట్లు... రెండు కలిపితే పుష్ప2 నాలుగు రోజుల వసూళ్లతో సమానం అంటున్నారు.. ఇది నిజంగా నమ్మేలా ఉందా? పుష్ప2 మీద జనాల్లో క్రేజుంది..

  • Written By:
  • Publish Date - December 10, 2024 / 06:36 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర లైఫ్ టైం వసూళ్లు 510 కోట్లు… రెబల్ స్టార్ ప్రభాస్ వసూళ్లు 350 కోట్లు… రెండు కలిపితే పుష్ప2 నాలుగు రోజుల వసూళ్లతో సమానం అంటున్నారు.. ఇది నిజంగా నమ్మేలా ఉందా? పుష్ప2 మీద జనాల్లో క్రేజుంది.. నార్త్ ఇండియాలో ఈ సినిమా మీద మాస్ ఆడియన్స్ కి మోజంది. అంతవరకు ఓకే కాని పుష్ప2 రోజుకో రెండు వందలకోట్లు రాబడుతోందనే మాటే నమ్మేలా కనిపించట్లేదు. కాని నిర్మాతలే రెండో రోజు,మూడో రోజు, నాలుగో రోజంటూ రోజుకో పోస్టర్ వదులుతున్నారు. తక్కువ మార్కులొచ్చిన స్టూడెంట్ తనకి తానే మార్కులేసుకునే ప్రాసెస్ లో, 100 కి రెండొందల మార్కులేస్తే దొరికిపోయినట్టు… పుష్ప2 వసూల్లు కూడా దొరికిపోయేలా చేస్తున్నాయా? ఇంతకి ఈ లెక్కల వెనకున్న షాకులేంటి? నిజాలేంటి?

దేవర సౌత్ లోకంటే నార్త్ లోనే మాస్ మతిపోగొట్టింది. కాబట్టే తెలుగుతో పోలిస్తే అక్కడే 350 కోట్లు అదికంగా వచ్చాయి. మొత్తంగా 510 కోట్ల నెట్ వసూళ్లనే ఫిల్మ్ టీం ఎనౌన్స్ చేసింది కాని, గ్రాస్ వసూళ్లు ఎనౌన్స్ చేయలేదు. కాని పుష్ప2 టీం మొదటి రోజు 294 కోట్లు, రెండో రోజు 400 కోట్లు, మూడో రోజు 621 కోట్లు, నాలుగో రోజు 829 కోట్లంటూ రోజు కో పోస్టర్ వదులుతోంది

అంటే పుష్ప 2 రెండో రోజే టాక్ వీకైనా, థియేటర్స్ లో సీట్లు ఖాలీగా కనిపిస్తున్నా, రోజుకు 2 వందల కోట్లు రాబడుతోందా? ఇది నిజంగా నమ్మొచ్చా..? సరే ప్రివ్యూకి వసూళ్లొచ్చాయి అంటే పర్లేదనుకోవచ్చు. రిలీజ్ రోజు ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయంటే నమ్మొచ్చు.. కాని టాక్ బయటికొచ్చాక, వసూళ్లు డ్రాప్ అయిన సంగతి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా, రోజుకు రెండొందల కోట్ల వసూల్లొస్తున్నాయంటేనే డౌట్లకి గేట్లు తెరుచుకుంటున్నాయి

యాంటీ ఫ్యాన్స్ బాలేదంటారు. మెగా ఫ్యాన్స్ కామెంట్ల దాడి చేస్తారు.. కాబట్టే పుష్ప 2 హిట్టైనా కాదని నెగెటీవ్ ప్రచారం చేస్తున్నారనుకోవచ్చు.. కాని కామన్ ఆడియన్స్ ఎక్కడా? ఫ్యామిలీ ఆడియన్స్ జోరు ఇంకెక్కడ.. వాళ్లు రాకుండా కేవలం ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ తోనే 829 కోట్లొచ్చాయంటే కాస్త ఈ లెక్కల వెనకున్న లోపాలు బయట పడుతున్నాయంటున్నారు

నిజానికి ఒక పొలటీషియన్ పెట్టే సభ సక్సెస్ అవలంటే జనాలను రోజుకి 500 ఇచ్చి తీసుకెళతారు.. సభనిండా జనం ఉంటే, మీడియా కవరేజ్ బాగుంటుంది, ఈ వీడియో చూసే జనాల్లో ఉత్సాహం కూడా వస్తుంది… అచ్చంగా ఇలానే థియేటర్స్ లో జనం లేకున్నా, కార్పోరేట్ సంస్థలే టిక్కెట్లు కొని, మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చేలా చేస్తున్నాయి.

బాలీవుడ్ లో ఈ దిక్కుమాలిన కల్చర్ వల్లే, జవాన్, పఠాన్ కి 1000 కోట్ల సీన్ వచ్చిందంటారు.. అందులో 300 కోట్లు నిర్మాత సొంతడబ్బుతో టిక్కెట్లు కొన్నాడని అప్పట్లో కామెంట్లు కూడా వచ్చాయి. కట్ చేస్తే అంత ఖర్చు చేయటం వల్ల నిర్మాతకేం లాభం అంటే, అక్కడే కిటుకుంది…

ఒక సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి, టిక్కెట్లు దొరకనంతగా హౌజ్ ఫుల్ అవుతోందంటే, ఆ హైప్ కి ఇంట్లో కూర్చున్న బ్యాచ్ కూడా చూసేస్తే పోలా అన్న ఊపొస్తుందనేది మార్కెటింగ్ స్ట్రాటజీ… అలానే పుష్ప2 కోసం ఇప్పుడు చాలా కార్పోరేట్ కంపెనీలు 150 కోట్ల వరకు ఖర్చు చేశాయంటున్నారు. వాల్ల ప్రాడక్ట్స్ ని పుష్ప 2 పోస్టర్ తో ప్రచారం చేసుకుంటూ, తన కంపెనీ ఎంప్లాయిస్, లేదంటే చాలామంది స్టూడెంట్స్ కి టిక్కెట్లు కొని ఇలా థియేటర్స్ కి తరలించే ఛాన్స్ఉందనే డౌట్లు కూడా రేయిజ్ అవుతున్నాయి. పుష్ప2 కి మాస్ తోపాటు నార్త్ ఇండియాలో మంచి ఫాలోయింగే ఉంది. కాని వసూల్లే అబ్ నార్మల్ గా ఆర్టిఫీషియల్ గా పెంచేస్తున్నారనే డౌట్లకి కార్పోరేట్ బుక్కింగ్స్ కాన్సెప్ట్ తోడవుతోంది.