దేవర రిలీజ్ అవ్వగానే ఓపెనింగ్స్ 172 కోట్లొచ్చాయి. ఇంత పెద్దగా ఓపెనింగ్స్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 తో తీసుకువస్తాడా అన్నారు. కట్ చేస్తే వారం తిరక్క ముందే 400 కోట్ల నుంచి 480 కోట్ల వరకు దేవర వసూళ్ల సునామీ తెచ్చాడు. కాని మధ్యలో దేవర ఫ్లాపైంది..? పోయినట్టే.. లాంటి నెగెటీవ్ ప్రచారాలు, కామెంట్లు, రివ్యూలు వినిపించాయి.. ఇక్కడే పుష్ప 2 టీం కి కొంత కంగారు పెరిగింది. ఇక తమ పరిస్థితేంటో అనుకున్నారు. అంతలోనే దేవర మీద వచ్చిన రూమర్లకు వసూళ్లతో కౌంటర్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఫైనల్ గా దేవర సునామీలా దూసుకుపోతోంది. దీంతో పుష్ప 2 టీం కి కూడా ధైర్యం వచ్చిందన్నారు. కాని ధైర్యాన్ని మించిన భయం షురూ అయ్యింది. రాజమౌళి లాంటి దర్శకుడు లేడు, కొండలు పిండిచేసేంత హెవీ బడ్జెట్ కాదు.. అయినా దేవర 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్, 6 రోజుల్లో 400 కోట్లు, ఏడో రోజు 480 కోట్ల మార్క్ ని దాటేసింది.. ఇది కదా అసలు ఛాలెంజ్ అంటే, మరో 5 రోజుల్లో వెయ్యికోట్లలో ఈ సినిమా అడుగు పెడితే, విడుదలైన రెండు వారాల్లోపే థౌజెండ్ వాలాగా మారిన మూవీగా హిస్టరీ క్రియేట్ అవుతుంది. మరి ఆ ఫీట్ ని, ఆ రికార్డ్ ని పుష్ప రాజ్ టచ్ చేస్తాడా..? అందుకే దైర్యంలో అనుకోని భయం వెంటాడుతోందా?
పుష్ప రాజ్ కి ఊపొచ్చింది. దేవర దరువు చూసి పుష్ఫ టీం పండగ చేసుకుంటోంది. పుష్ప కూడా ఊర మాస్ యాక్షన్ డ్రామా కాబట్టి, దేవర దూకుడు ఆడియన్స్ కి నచ్చితే, పుష్ప 2 కూడా నచ్చిట్టే. అంతేకాకుండా హిట్ మూవీకి సీక్వెల్ కూడా కావటంతో పుష్ప 2 హిట్ ముందే కన్ఫామ్ అయ్యింది. అంతవరకు బానేఉంది. కాని దేవర రికార్డులే పుష్పరాజ్ ని భయపెడుతున్నాయి.
ఎందుకంటే దేవరకి ఊహించని రెస్పాన్స్, ఊహించని రీతిలో బాక్సాఫీస్ లోరికార్డులు క్రియేట్ అయ్యాయి.
ఓపెనింగ్సే 172 కోట్లు… ఆరేంజ్ లో పుష్ప 2 కి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ఉంది. అయినా కూడా డిసెంబర్ లో భూల్ భులయ్య 3 లాంటి మూవీలు పోటీ ఇవ్వటం హాలీవుడ్ సినిమాలు ఇండియన్ మార్కెట్ మీద దాడి చేసే ఛాన్స్ఉండటం ఒక ఎత్తైతే, ఈమధ్య సీక్వెల్లకు కాలం కలిసి రావట్లేదనే సెంటిమెంట్ భయం..
ఈకారనాలెలా ఉన్నా పుష్ప 2 కూడా డిసెంబర్ లోవచ్చి హిట్టైనా, దేవర రేంజ్ లో 6 రోజుల్లో 400 కోట్లు రాబడుతుందా? అన్ని భాషల్లో యూఎస్ మార్కెట్ ని కొల్లగొడుతుందా? వెయ్యికోట్ల వసూల్లు ఈజీ అనుకున్న సలార్ కే 750 కోట్ల దగ్గర బ్రేక్ పడింది… సో బాక్సాఫీస్ లో ఏదైనా జరగొచ్చు
కాకపోతే దేవర మాస్ హిట్ అవటం, పుష్ప లానే ముందు నెగెటీవ్ టాక్ తో వచ్చి, తర్వాత వసూళ్ల కిక్ తో దూసుకెళ్లటం గొప్పవిషయమే.. అలా థియేటర్స్ కి జనాలు క్యూ కట్టడం వల్ల, పుష్ప 2 కోసం కూడా జనాలు క్యూకట్టే ఛాన్స్ఉంది. మరీ ముఖ్యంగా మాస్ కి పుష్ప 2 ఎక్కే ఛాన్స్ఉంది. ఓరకంగా రెండో మ్యాచ్ ని ఫస్ట్ మ్యాన్ హిట్ ప్రభావితం చేసినట్టు, దేవర హిట్, పుష్ప 2 కి ఊపుతెస్తోంది.
ఎటొచ్చి దేవర మూవీ వెయ్యికోట్ల రికార్డే పుష్ప 2ని భయపెట్టేలా ఉంది. కారణం, 7 రోజుల్లో 480 కోట్లు, అంటే 14 రోజుల్లో దాదాపు వెయ్యికోట్ల వసూళ్లు వచ్చే చాన్స్ఉంది. అదే జరిగితే, బాహుబలి 2, కల్కీ, జవాన్, పటాన్, దంగల్, ఇలా ఏ సినిమా కూడా 14 రోజుల్లో థౌజెండ్ వాలా అనిపించుకుంది లేదు. అలా జరిగితే, ఇది ఇండియన్ సినిమాలో మొదటి రికార్డ్ అవుతుంది. అలాంటి రికార్డులన్నీ దేవర సెట్ చేసి పెడితే, పుష్ప 2 తో బన్నీ వాటిని బ్రేక్ చేయటం కాదు, కనీసం రీచ్ చేయటం కూడా కష్టమౌతుంది.