ఇదెక్కడి మాస్ ట్విస్ట్… దేవర 2 vs డ్రాగన్…

ఎన్టీఆర్ కొత్త సినిమాకు సేమ్ హీరో చేసిన పాత మూవీ పోటీ ఇచ్చేలా ఉంది. బేసిగ్గా ఒక స్టార్ ఏదైనా ప్రయోగం చేస్తే, ఆ మూవీకి మరో హీరో సినిమా పోటీ ఇవ్వటం కామన్. కాని తనకి తానే పోటీ అన్న మాటని నిజం చేస్తున్నాడు ఎన్టీఆర్.

  • Written By:
  • Publish Date - November 23, 2024 / 04:45 PM IST

ఎన్టీఆర్ కొత్త సినిమాకు సేమ్ హీరో చేసిన పాత మూవీ పోటీ ఇచ్చేలా ఉంది. బేసిగ్గా ఒక స్టార్ ఏదైనా ప్రయోగం చేస్తే, ఆ మూవీకి మరో హీరో సినిమా పోటీ ఇవ్వటం కామన్. కాని తనకి తానే పోటీ అన్న మాటని నిజం చేస్తున్నాడు ఎన్టీఆర్. తన పాన్ ఇండియా మూవీ డ్రాగన్ కి తలినొప్పిలా మారబోతోంది, తను చేసిన మరో సినిమా. ఇదే ఇక్కడ విచిత్రమైన ఇబ్బంది. పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన దేవర మూవీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ కి తలనొప్పిగా మారేలా ఉందట. వార్ 2 షూటింగ్ తో ఎన్టీఆర్ బిజీ అయితే, తను లేని సీన్లను తెరకెక్కిస్తు ప్రశాంత్ నీల్ వేగం పెంచాడు. ఇలాంటి టైంలో దేవర 2 బాంబు పేలేలా ఉంది. ఆల్రెడీ తెరవెనుక కొరటాల శివ గళం పెంచాడటం. ఎన్టీఆర్ సర్దిచెప్పలేకపోతున్నాడట.. ఇంతకి దేవర 2 తో వచ్చిన చిక్కేంటి? టేకేలుక్

కిలో ఐరన్ బరువైందా? కిలో పేపర్ బరవైందా అంటే ఆన్సర్ ఏంటి… ? రెండు సమానమే? కాని మనసుకి మాత్రం ఇనుము మాత్రమే బరువైందని పిస్తుంది..మెదడుకి మాత్రం రెండు సమానమే అనిపిస్తాయి.. కారణం పదార్ధం కాదు, దాని బరువు రెండీంట్లో కామన్ గా ఉండటం.. ఈ పోలికకు కారణం కిలో బరువు,మళ్లీ మరో కిలో బరువుతోనే పోటీ పడాల్సి రావటం.. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీకి, తారక్ సినిమానే పోటీగా మారుతోంది

నిజంగా దేవర 2 ఇప్పుడు డ్రాగన్ కే ఎసరు పెట్టేలా ఉంది. దానికి సాలిడ్ రీజన్ ఉంది. ఇక ఇలాంటి డిస్కర్షన్ మొదలవ్వటానికి రీజన్ కొరటాల శివే. గత రెండు వారాలుగా దేవర2 ఉండదనే నెగెటీవ్ ప్రచారం జరుగుతోంది. దేవర సీక్వెల్ ఆల్ మోస్ట్ అటకెక్కినట్టే అంటూ చాలా మంది నెగెటీవ్ ప్రచారం పెంచారు. ఆమాత్రానికే కొరటాల శివ కంగారు పడతాడనుకోలేం.

కాని రియాలిటీ చూస్తే దేవర తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ తో బిజీ అయ్యాడు. ఫిబ్రవరిలో ఇది పూర్తవుతుంది. తర్వాత ప్రశాంట్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ స్పీడ్ అందుకుంటుంది. అది కనీసం ఏడాది వరకు తెరకెక్కే ఛాన్స్ఉంది. ఆతర్వాత నెల్సన్ దిలీప్ తో తారక్ సినిమా ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది.

ఎలా చూసినా 2026 వరకు డ్రాగన్ సినిమా తోనే ఎన్టీఆర్ కి సరిపోయేలా ఉంది. ఇలాంటి టైంలో నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ పట్టాలెక్కడమే కష్టం అంటే, ఇక దేవర సీక్వెల్ కి టైం ఎక్కడుంటుంది. సో దేవర టెంపరరీగా అటకెక్కి, తర్వాత పర్మినెంట్ గా అటకెక్కే ఛాన్స్ఉందనే కామెంట్స్ పెరిగాయి

కాని దేవర క్లైమాక్స్ చూసిన ఎవరికైనా దేవర 2 రాకుండా ఉండదనే క్లారిటీ ఉంది. కాని ఎప్పుడు..? మరీ వార్2, డ్రాగన్ అయ్యాకే దేవర 2 అంటే చాలా టైం పడుతుంది. పుష్ప లాంటి మూవీకి సీక్వెల్ తప్ప మరో సినిమా చేయకుండా బన్నీ దూసుకెళితేనే, ఇంత లేటా అన్నారు. కాబట్టి ఏ మూవీ హిట్టైనా దానికి సీక్వెల్ సాధ్యమైనంత త్వరగా రావాల్సిందే..

బాహుబలి తర్వాత బాహుబలి 2 చేశాకే ప్రభాస్ మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు. కేజీయఫ్ తర్వాత కేజీయఫ్ 2 తో యశ్ దండెత్తాడు. పొన్నియన్ సెల్వన్ తో మణిరత్నం కూడా వరుసగా రెండు భాగాలు వదిలాడు. అంటే ఒక మూవీ హిట్టైందంటే, దాని సీక్వెల్ ని వెంటనే తీసేశాయి. వేడిమీదున్నప్పుడే దాడి చేయాలి. ఇదే మాటని కొరటాల శివ ఎన్టీఆర్ దగ్గర ప్రస్థావించటం వల్లే, డ్రాగన్ ని స్లోగా ప్లాన్ చేసి, మార్చ్ నుంచి దేవర 2 పనులు మొదలు పెట్టాలని ప్రెజర్ చేస్తున్నాడట. మరి డ్రాగన్ కి తాత్కాలికంగా బ్రేక్ వేసి దేవర2 తీస్తారా? లేదంటే రెండూ ప్యార్ లల్ గా తెరకెక్కుతాయో ఫిబ్రవరిలో తేలబోతోంది.