Devara: దేవర సిద్ధం.. క్లైమాక్స్ షూట్‌కు భైరా వచ్చేస్తున్నాడు..!

జెట్ స్పీడ్‌తో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీలో.. భైరాగా సైఫ్ అలీఖాన్ మాస్ లుక్‌కు ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా.. సైఫ్ అలీఖాన్‌కి గాయం కారణంగా క్లైమాక్స్ షూట్‌ని వాయిదా వేశారు. అయితే.. సైఫ్‌ ఇప్పుడు కోలుకోవ‌డంతో సైఫ్ త్వ‌రలోనే క్లైమాక్స్ షూట్‌లో పాల్గొంటాడ‌ని టాక్ వినిపిస్తోంది.

  • Written By:
  • Updated On - February 27, 2024 / 06:24 PM IST

Devara: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా ‘దేవ‌ర‌. యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రిలీజైన లుక్స్, గ్లింప్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు త‌గ్గ‌ట్లుగా ఈ మూవీని డైరెక్ట‌ర్ కొర‌టాల శివ నెక్స్ట్ లెవ‌ల్‌లో తెరకెక్కిస్తున్నాడు. దేవ‌ర కోసం సెప‌రేట్‌గా ఓ లోకాన్నే సృష్టించాడ‌ట కొర‌టాల శివ‌. మ‌రి ఈ ప్రెస్టీజియ‌స్ మూవీలో బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్‌ చాకో విలన్స్‌గా న‌టిస్తున్నారు.

PRABHAS SPIRIT: ప్రభాస్ స్పిరిట్.. ఈసారి యానిమల్‌ను మించి..!

కాగా.. దేవ‌ర క్లైమాక్స్‌కి సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. జెట్ స్పీడ్‌తో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీలో.. భైరాగా సైఫ్ అలీఖాన్ మాస్ లుక్‌కు ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా.. సైఫ్ అలీఖాన్‌కి గాయం కారణంగా క్లైమాక్స్ షూట్‌ని వాయిదా వేశారు. అయితే.. సైఫ్‌ ఇప్పుడు కోలుకోవ‌డంతో సైఫ్ త్వ‌రలోనే క్లైమాక్స్ షూట్‌లో పాల్గొంటాడ‌ని టాక్ వినిపిస్తోంది. దీంతో.. చిత్ర యూనిట్ క్లైమాక్స్ షూట్‌కి సన్నాహాలు చేసుకుంటోంది. సైఫ్ అలీఖాన్ మార్చి రెండో వారం నుంచి డేట్స్ ఇచ్చాడని.. దీంతో.. మార్చి రెండో వారం నుంచి ‘దేవర’ క్లైమాక్స్, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం కొర‌టాల లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు. సో.. దేవ‌ర బ్యాలెన్స్ షూట్ వేగంగా జ‌ర‌గ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. దేవ‌ర మూవీని రెండు పార్టులుగా తెర‌కెక్కించ‌బోతున్నారు.

‘దేవర పార్ట్ 1’.. అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఇక‌.. ఈ మూవీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న‌ లుక్‌తో అద‌ర‌గొట్టేశాడు. ఈ మూవీలో త‌న క్యారెక్ట‌ర్ కు త‌గ్గ‌ట్లుగానే.. తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్‌గా ఉంటుందని ఇప్పటికే కొరటాల శివ చెప్పారు. సముద్రపు భూభాగాల్లో జరిగే కథ అని, ఇందులో మాస్ సీన్స్ చాలా ఉన్నాయని, ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరగగా అందులో అన్నీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. మ‌రి.. వాటిని దేవ‌ర ఎలా రీచ్ అవుతాడో చూడాల్సిందే.