Devara: భయానికి మరో కొత్త పేరు దేవర.. 150 రోజుల్లో ఊచకోత

ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడట ఎన్టీఆర్. అంతేకాదు.. కొరటాల శివ కొన్ని ప్రమాదకరమైన విన్యాసాలు చేయిస్తున్నాడట. తారక్‌ కూడా అస్సలు కాంప్రమైజ్ అవకుండా చాలా కష్టపడుతున్నాడట. ఇప్పటికే.. అండర్‌వాటర్‌ ఫైట్‌కోసం రోజుల తరబడి శిక్షణ తీసుకున్నాడు ఎన్టీఆర్.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 03:52 PM IST

Devara: రాజమౌళి (SS RAJAMOULI) తో ఏ హీరో పని చేసినా కూడా.. ఆ తర్వాత చేసే సినిమాలు ఫ్లాప్ అయ్యే బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. అందుకే.. దేవర (Devara) జక్కన్న రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు. ఈ సినిమాను కొరటాల శివ (KORATALA SHIVA) సముద్రం బ్యాక్ డ్రాప్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా దేవర రాబోతోంది. ఇప్పటికే భారీ యాక్షన్స్ సీక్వెన్స్‌ తెరకెక్కించిన కొరటాల.. రీసెంట్‌గా గోవాలో కీలక షెడ్యూల్ కంప్లీట్ చేశాడు.

PAWAN KALYAN: పంచుల్లేని పవన్ ప్రసంగం.. బీజేపీ సభలో అంటీ ముట్టనట్టు..!

ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడట ఎన్టీఆర్. అంతేకాదు.. కొరటాల శివ కొన్ని ప్రమాదకరమైన విన్యాసాలు చేయిస్తున్నాడట. తారక్‌ కూడా అస్సలు కాంప్రమైజ్ అవకుండా చాలా కష్టపడుతున్నాడట. ఇప్పటికే.. అండర్‌వాటర్‌ ఫైట్‌కోసం రోజుల తరబడి శిక్షణ తీసుకున్నాడు ఎన్టీఆర్. కొరటాల కూడా యాక్షన్ స్టంట్స్‌ కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్లను రంగంలోకి దింపాడు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ హై వోల్టేజ్ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని పోస్టర్స్‌తోనే రుజువు చేశారు. మొత్తంగా.. దేవర చాలా పవర్ ఫుల్‌గా రాబోతోంది. ఖచ్చితంగా ఈ సినిమా యంగ్ టైగర్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. తాజాగా దేవర 150 రోజుల్లో థియేటర్లోకి రానుందని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు మేకర్స్. భయానికి మరో పేరే దేవర. 150 రోజుల్లో పెద్ద స్క్రీన్లలో అత్యంత భారీ ప్రదర్శనను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ అదిరిపోయే పోస్టర్ రివీల్ చేశారు.

Anasuya Bharadwaj: అనసూయ సెన్సేషనల్ కామెంట్స్.. అడివి శేష్‌ను వదలని అనసూయ

ఇందులో రెండు చేతులతో ఆయుధాలు పట్టుకుని.. నీళ్ల మధ్యలో రాయి మీద నిలబడి భీకరంగా కనిపిస్తున్నారు తారక్. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా..బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి.