దేవర రాడ్ టాక్, బుక్ మై షోలో గంటలో 38 వేల టికెట్ లు బుక్

ఓ వైపు నెగటివ్ టాక్, మరో వైపు ఫ్యాన్స్ కూడా నిరాశగా బయటకు వస్తున్న సీన్లు... ఒక దానికి మరొకటి ఏకమై దేవరను దెబ్బ కొడుతున్నాయి. సినిమాకు గత నెల రోజుల నుంచి అన్ని విధాలుగా నెగటివ్ టాక్, సినిమా నుంచి ఏ ప్రకటన వచ్చినా ఒక్క ఫ్యాన్స్ మినహా ప్రతీ ఒక్కరు టార్గెట్ చేయడమే.

  • Written By:
  • Publish Date - September 28, 2024 / 04:56 PM IST

ఓ వైపు నెగటివ్ టాక్, మరో వైపు ఫ్యాన్స్ కూడా నిరాశగా బయటకు వస్తున్న సీన్లు… ఒక దానికి మరొకటి ఏకమై దేవరను దెబ్బ కొడుతున్నాయి. సినిమాకు గత నెల రోజుల నుంచి అన్ని విధాలుగా నెగటివ్ టాక్, సినిమా నుంచి ఏ ప్రకటన వచ్చినా ఒక్క ఫ్యాన్స్ మినహా ప్రతీ ఒక్కరు టార్గెట్ చేయడమే. సినిమా కాస్తో కూస్తో బాగున్నా ఫ్యాన్స్ కి కూడా నచ్చకపోవడం చాలా చికాకుగా మారిన విషయం. సినిమాలో ఓపెనింగ్ షాట్ దగ్గర మొదలు హీరోయిన్ నుంచి ప్రతీ ఒక్కటి ఫ్యాన్స్ కూడా తిట్టిన పరిస్థితి. కొందరు సినిమా బాగుంది అనడం మరికొందరు బాగా లేదు అనడం.

ఇలా అన్ని విధాలుగా సినిమాకు నెగటివ్ వచ్చింది. దీనితో వసూళ్లు భారీగా పడిపోయే అవకాశం ఉందని అందరూ లెక్కలు వేస్తున్నారు. అయితే ఇతర భాషల్లో మాత్రం సినిమాకు నెగటివ్ టాక్ ఈ రేంజ్ లో లేదు అనే చెప్పాలి.ముఖ్యంగా హిందీ, తమిళ, కన్నడ భాషల్లో సినిమాకు మంచి స్పందన వచ్చింది. అక్కడి రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సినిమా కాస్త లాగ్ అనిపించినా అన్నీ బాగానే ఉన్నాయని అక్కడి వాళ్ళు అంటున్నారు. ఇక వసూళ్లు కూడా అక్కడ నిదానంగా పుంజుకున్నాయి. రాబోయే రెండు రోజులు సినిమాకు చాలా కీలకం.

వీకెండ్ ఉండటం త్వరలోనే గాంధీ జయంతి కూడా ఉండటంతో సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక బుక్ మై షో లో మాత్రం సినిమాకు నెగటివ్ టాక్ తో సంబంధం లేకుండా టికెట్స్ బుక్ అవుతున్నాయి. యావరేజ్ న గంటకు 30 వేల టికెట్ లు బుక్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత గంటలో చూస్తే 38 వేల టికెట్ లు బుక్ అయ్యాయి. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత ఈ రేంజ్ లో బుకింగ్స్ జరగడం కొందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీనితో సినిమా మళ్ళీ పుంజుకుందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా రాబోయే మూడు నాలుగు రోజులు దేవరకు అగ్నిపరీక్ష.