ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాకు లేని హైప్ దేవరకు క్రియేట్ అవుతోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాకు కూడా ప్రీ బుకింగ్ మార్కెట్ ఈ రేంజ్ లో జరిగిన దాఖలాలు లేవు. అసలు ఏ తెలుగు సినిమాకు ఇంత బజ్ క్రియేట్ కాలేదు అంటారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ సోలోగా వస్తున్న సినిమా దేవర. ఆరేళ్ళలో ఎన్టీఆర్ నటించింది కేవలం ఆర్ఆర్ఆర్ మాత్రమే. అది కూడా మల్టీ స్టారర్ సినిమా. అసలు దేవర సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఫ్యాన్స్ కి కూడా చాన్నాళ్ళ పాటు క్లారిటీ లేదు. కాని దేవర సునామీ మాత్రం ఆగలేదు .
విడుదలకు ముందే భారీ మార్కెట్ క్రియేట్ చేసుకుంది దేవర. అమెరికాలో అయితే దేవర దెబ్బకు అక్కడి హాలీవుడ్ జనాలు కూడా షాక్ అవుతున్నారు. ఇక మన దేశంలో భాషతో సంబంధం లేదు జాతరకు. బొమ్మ ఎప్పుడు పడుతుందా అని ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు కొందరు సినిమా పండితులు దేవర సినిమా మొదటి రోజు వసూళ్ళపై ఓ లెక్క వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో… దేవర 85 నుంచి 90 కోట్లు మొదటి రోజు వసూలు చేసే సూచనలు కనపడుతున్నాయి అంటున్నారు ఫ్యాన్స్.
ఓవర్సీస్ లో 45 నుంచి 50 కోట్లు పక్కా అని అంచనా వేస్తున్నారు. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కనీసం 20 కోట్లు వసూలు చేయవచ్చని భావిస్తున్నారు. ఇక హిందీలో 10 నుంచి 12 కోట్లు అంచనా వేస్తున్నారు. మొత్తంగా డే 1 వసూళ్లు… ప్రపంచ వ్యాప్తంగా 160 నుంచి 170 కోట్ల వరకు ఉంటాయని లెక్కలు వేస్తున్నారు. ఒక్క కర్ణాటకలోనే 16 నుంచి 20 కోట్ల వసూళ్లు ఉండే ఛాన్స్ కనపడుతోంది. ఇదే జరిగితే మాత్రం సలార్ 71 కోట్ల రికార్డు, కల్కీ 70 కోట్ల రికార్డ్ బద్దలు కావడం ఖాయం అంటున్నారు. ఏది ఎలా ఉన్నా మొదటి రోజు 150 కోట్లు తగ్గేది లేదని తొడలు కొడుతున్నారు ఫ్యాన్స్.