దేవర పోయిందన్నారు. కొందరైతే కష్టం అన్నారు. ఏమైంది ఓపెనింగ్స్ తప్ప మండే వసూల్లు గగనం అనేశారు. విచిత్రంగా సోమవారం వసూళ్లే కాదు, మంగళవారం మ్యాజిక్ కూడా మతిపోగొడుతోంది. సలార్ ని కూడా ఇలానే మొదట్లో అన్నారు. పుష్పకి ఇదే పరిస్థితి ఎదురైందన్నారు. కాని అవి విడుదలయ్యాక వచ్చిన టాక్ నుంచి పుంజుకోటానికి వారం పట్టింది. దేవరకి మాత్రం ఒక్కరోజులోనే సీన్ మారింది. శుక్రవారం అదిరిపోయే ఓపెనింగ్స్, శనివారం మిక్స్ డ్ టాక్…. కట్ చేస్తే ఆదివారం అదిరిపోయే వసూళ్లు.. మండే నుంచి సౌత్ కంటే నార్త్ ఇండియాలోనే మతిపోగొట్టే రేంజ్ వసూళ్లు ఇవే బీటౌన్ కి షాక్ ఇస్తున్నాయి. రివ్యూలు రాసిన వాళ్లని, కామెంట్లు చేసిన వాళ్లని కంబైండ్ గా ఏకి పారేస్తున్నాయి దేవర వసూళ్లు.. అక్కడే దేవర మతలబేంటో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఎన్టీఆర్ అంతగా మాస్ పల్స్ ఎలా పట్టుకున్నాడనే చర్చ పెరిగింది. కామెంట్ల దాడి పూర్తిగా ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితి మరే మూవీకి ఇంత వేగంగా రాలేదు…
దేవర ఎందుకు హిట్టైంది… కథ కత్తిలా ఉందనా…? కథనం కదిలించిందా…? కొరటాల శివ ఏమైనా మ్యాజిక్ చేశాడా? ఎన్టీఆర్ క్రేజ్ వల్లే ఇదంతా సాధ్యమైందా..? ఇది సౌత్ లోకాదు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో జనాలు వేస్తున్న ప్రశ్నలు…
బేసిగ్గా సౌత్ సినిమాలు ఎలా ఆడుతున్నాయంటే, కంటెంట్ కత్తిలా ఉందనే మాటే వినిపస్తుంది. కాని సలార్, పుష్ప, దేవర ఈమూడు సినిమాలు విడుదలైన కొత్తలో కామన్ గా వినిపించిన మాట, సినిమా పోయింది… ఇదో రాడ్ మూవీ అన్నారు. అంతెంతుకు ఈ మూడు సినిమాలకు రివ్యూలరూపంలో 5 కి రెండే మార్కులేశారు..
కాని ఏమైంది మూడు బాలీవుడ్ మాడు పగల గొట్టాయి. ఎవరికీ దేవర సునామీ వెనకున్న రీజన్స్ అర్ధం కావట్లేదు. ఎన్టీఆర్ ఒకే ఒక్క త్రిబుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆమాత్రం క్రేజ్ కే తన రెండో సినిమా బాలీవుడ్ మార్కెట్ లని కూడా షేక్ చేస్తోందా? అన్న ప్రశ్న బీటౌన్ బ్యాచ్ ని వేధిస్తోంది.
దేవర సినిమాలో భయంకరంగా విలన్న ఊచకోత కి కారణం కావొచ్చు.. కాని బాక్సాఫీస్ లో మాత్రం మరీ ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్లో దేవర ఓ సైలెంట్ సునామీ… ముందుగా మరాఠీ జనాలకు దేవర బాగా ఎక్కేసింది. అది కూడా ముంబై, పూనా లాంటి సిటీల్లో కాదు, అక్కడి టైర్ టూ సిటీస్ లోకి దేవర వెళ్లాడు.. ఓ తెలుగు సినిమా, మారాఠా మారు మూలు గ్రామాల్లోని సింగిల్ థియేటర్స్ లో ఆడటం అంటే అదో వింతే…
ఇక ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్య ప్రదేష్ లో కూడా దేవరకి నిదానంగా వసూళ్ల వరద పెరుగుతోంది. హర్యాణ లో దేవర ఎటాక్ కి మాస్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అంతెంతుకు లారీ డ్రైవర్స్ లో ఎక్కువ మంది దేవర పాటలకే ఫిదా అవుతున్నారంటే, పంజాబీ దాబాల్లో ఈ పాటలు కూడా వినిపిస్తున్నాయంటే, దేవర ఏస్థాయిలో ఉత్తరభారత దేశంలో దూసుకెళతున్నాడో అర్ధమైపోతుంది. అంతెందుకు దేవర వసూళ్లన్ని ఫేక్, కావాలనే నిర్మాతలు మొదటి రోజు భారీగా టిక్కెట్లు కొని, ఇలా చేస్తున్నారన్నారు..
మరి పంజాబ్, గుజరాత్, యూపీ, ఎంపీ ఇలా ఉత్తర భారత దేశంలోని ఇన్ని రాష్ట్రాల్లో అన్ని టిక్కెట్టు దేవర నిర్మాతలే కొంటున్నారు.. ఇంతకగా కొనగలరా..? బేసిగ్గానే సౌత్ సినిమా అంటే బాలీవుడ జనాల్లో కొంత చిన్న చూపు. బాహుబలి నుంచి త్రిబుల్ ఆర్ వరకు ఎన్ని సినిమాలు చరిత్ర స్రుష్టించినా వాళ్లలో తామే ఇంకా తోపులమనే భ్రమలు పోయినట్టున్నాయి. అందుకే దేవర సక్సెస్ ని కూడా బాలీవుడ్ లో చాలా మందికి నచ్చట్లేదు. అదే కామెంట్ల రూపంలో మొదటి రెండు మూడు రోజులు కనిపించింది. ఇప్పుడు సౌత్ కంటే ఎక్కువగా నార్త్ లోనే వసూళ్లు రావటంతో, అదేదో అటాక్ జరిగితే అంతా గప్ చుప్ అయినట్టు, ట్విట్టర్ లో నెగెటీవ్ కామెంట్స్ మాయమయ్యాయి. పాత కామెంట్లు మాయం, కొత్త కామెంట్లు పెట్టేందుకు భయం.. ఇది నార్త్ ఇండియాలో దేవర క్రియేట్ చేసిన భయం… యాంటీ కామెంట్ల ధైర్యం మీద ఎటాక్ చేసిన దేవర వసూళ్ల బలం…