దేవర సినిమా వసూళ్ళ దెబ్బకు ఇప్పుడు ఇండియా షేక్ అవుతోంది. బాలీవుడ్ లేదు టాలీవుడ్ లేదు సినిమా వసూళ్ళ విషయంలో దేవర కొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుంది. సైలెంట్ గా దేవర దెబ్బ ఎలా ఉంటుందో చూపించాడు ఎన్టీఆర్. ఎవడు ఏ రూపంలో టార్గెట్ చేసినా దేవర మాత్రం తన హవా కంటిన్యూ చేస్తోంది. అమెరికా లేదు అమలాపురం లేదు దేవర దెబ్బకు ఇప్పుడు రికార్డులు దాసోహం అంటున్నాయి. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో తెలుగు సినిమా సత్తా చాటుతోంది దేవర సినిమా. ఎస్ ఇప్పుడు లెక్కలు చూస్తే అదే ప్రూవ్ అవుతోంది.
దేవర సినిమా విషయంలో జనాలకు ఉండే సందేహాలు అన్నీ రోజులు పెరుగుతున్న కొద్దీ తొలగిపోతున్నాయి. టార్గెట్ చేసిన నోళ్ళు అన్నీ ఇప్పుడు గట్టిగా మూసుకునే పరిస్థితి తీసుకొచ్చింది దేవర సినిమా. హిందీలో అక్కడి స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని కొన్ని రికార్డులను దేవర సొంతం చేసుకోవడం ఆశ్చర్యంగా మారింది. సాధారణంగా ఈ రోజుల్లో ఒక సినిమా విడుదలై దాని మేనియా కొనసాగాలి అంటే సూపర్ హిట్ టాక్ ఉండాలి. అది ఏ భాషలో అయినా సరే. గట్టిగా ఆడితే సినిమా పది రోజులు అంతే.
ఒక్కసారి నెగటివ్ టాక్ వచ్చింది అంటే మాత్రం సినిమా నిలబడటం చాలా కష్టం. కాని దేవర సినిమా మాత్రం హిందీలో నిలబడింది. అక్కడి జనాలు సోషల్ మీడియాలో టార్గెట్ చేసినా సినిమా ఇంకా వసూళ్లు సాధిస్తోంది ఇప్పుడు. బాలీవుడ్ ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్శ్ లెక్కల ప్రకారం చూస్తే దేవర ఏ రేంజ్ లో హిందీ బెల్ట్ లో సునామీ సృష్టిస్తుందో స్పష్టంగా అర్ధమైపోతుంది. రెండో వారంలో దేవర సునామీ లెక్కలతో ఒక్కసారి చూద్దాం. శుక్రవారం… 2 కోట్ల 40 లక్షలు వసూలు చేసింది దేవర. ఇక శనివారం 3 కోట్ల 60 లక్షలు. అంటే కోటీ 20 లక్షలు పెరిగింది.
ఇక ఆదివారం విషయానికి వస్తే వీకెండ్ పీక్స్ కి వెళ్ళింది. 4 కోట్ల 20 లక్షల వసూళ్లు సాధించింది. సోమవారం కాస్త తగ్గి కోటి 90 లక్షలు వసూలు చేసింది. మంగళవారం కోటి 50 లక్షలు వసూలు చేసింది దేవర. బుధవారం కోటి 40 లక్షలు సాధించింది. గురువారం కోటి 25 లక్షలతో కాస్త తగ్గింది. టోటల్ గా మొదటి వారం 48 కోట్ల 27 లక్షలు హిందీలో వసూలు చేస్తే రెండూ వారం 16 కోట్ల 25 లక్షలు వసూళ్లు సాధించింది. మొత్తంగా హిందీ బెల్ట్ లో 64 కోట్ల 52 లక్షల వసూళ్లు దేవర సొంతం చేసుకుంది. ఇలా దేవర హిందీలో సునామీ సృష్టిస్తోంది.