నైజాం టూ నెల్లూరు, ప్రభాస్ నే టార్గెట్ చేసిన దేవర, లెక్కలు ఇవే

దేవర సినిమా దీనెమ్మ టాలీవుడ్ లో కొత్త లెక్కలు ప్రూవ్ చేస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కు దేవర సినిమా మొదటి సోలో పాన్ ఇండియా సినిమా. అరవింద సమేత సమయంలో ఇంత హడావుడి అయితే పక్కాగా లేదు అనే చెప్పాలి.

  • Written By:
  • Publish Date - October 7, 2024 / 06:53 PM IST

దేవర సినిమా దీనెమ్మ టాలీవుడ్ లో కొత్త లెక్కలు ప్రూవ్ చేస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కు దేవర సినిమా మొదటి సోలో పాన్ ఇండియా సినిమా. అరవింద సమేత సమయంలో ఇంత హడావుడి అయితే పక్కాగా లేదు అనే చెప్పాలి. ఎన్టీఆర్ ప్రమోషన్ కూడా ఇతర భాషల్లో చేయలేదు అనడం వాస్తవం. కాని దేవర విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రతీ ఒక్కటి పక్కా లెక్కతో తీసుకున్నాడు అనే చెప్పాలి. ఎన్టీఆర్ విషయంలో కొరటాల శివ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు అనే విషయం అర్ధమైంది. నెగటివ్ టాక్ వస్తుందని చిత్ర యూనిట్ ముందే గ్రహించి ఉండవచ్చు.

అందుకే గ్రాండ్ గా రంగంలోకి దిగారు. 500 కోట్లు వసూళ్లు దాటింది దేవర. ఎన్టీఆర్ కెరీర్ లో ఇదే ఈ రేంజ్ లో వసూళ్లు చేయడం. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా వసూలు చేసింది. ఇక ఈ రికార్డుల్లో ప్రభాస్ రికార్డులను కనుమరుగు చేస్తోంది అనే విషయం పక్కాగా అర్ధమవుతోంది. విదేశాల్లో ప్రీ బుకింగ్ మార్కెట్ విషయంలో కూడా ప్రభాస్ ను టార్గెట్ చేసింది. అమెరికాలో ముఖ్యంగా ప్రభాస్ ను ఎక్కువగా టార్గెట్ చేసింది దేవర. ఇక ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవర కొన్ని లెక్కలు సరి చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ కు అసలు నచ్చడం లేదు.

అసలు ఏంటీ ఆ లెక్కలు అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాం. నైజాం లో 50 కోట్ల షేర్ సాధించినవి ప్రభాస్ కు గత 7 సినిమాల్లో 3 సాధించగా… ఎన్టీఆర్ కు గత రెండు సినిమాలకు 2 సాధించాయి. సీడెడ్ లో 25 కోట్ల షేర్ లో ప్రభాస్ కు గత 7 సినిమాలు తీసుకుంటే 1 మాత్రమే సాధించింది. ఇక నెల్లూరులో 5 కోట్ల షేర్ తీసుకుంటే ప్రభాస్ వి ఒక్క సినిమానే సాధించగా ఎన్టీఆర్ రెండు సినిమాలతో 5 కోట్ల షేర్ కొట్టాడు. ఇక గుంటూరు విషయానికి వస్తే 10 కోట్ల షేర్ ను ప్రభాస్ 7 సినిమాల్లో 2 సినిమాలు సాధించగా ఎన్టీఆర్ 2 సినిమాల్లో రెండు సాధించాయి.

ఇలా ఎన్టీఆర్ తన పోటీ కేవలం ప్రభాస్ తో అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. సలార్ సినిమా రికార్డులు కూడా ఎన్టీఆర్ చాలానే బద్దలు కొట్టాడు దేవరతో. ఇదే ఊపుతో ఉంటే మాత్రం కచ్చితంగా ప్రభాస్ తర్వాత టాలీవుడ్ లో ఎన్టీఆర్ అనేది ప్రూవ్ అవుతోంది. ప్రశాంత్ నీల్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఫ్యాన్స్ ఆసక్తి ఇప్పటి నుంచే పెరుగుతోంది. ఆ సినిమా కూడా ఇలాగే రికార్డులకు గురి పెడితే మాత్రం ఎన్టీఆర్ నెంబర్ 1 అంటున్నారు ఫ్యాన్స్.