మన టాలీవుడ్ హీరోలకు సినిమా హిట్, ఫ్లాప్ మేటర్ కాదు. తమ ఇమేజ్ సినిమాతో పెరిగిందా తగ్గిందా అన్నదే పాయింట్. ఆ పాయింట్ లో ఏ మాత్రం అటు ఇటు అయినా తేడా వచ్చేస్తది. బాలీవుడ్ హీరోలు లేదంటే సౌత్ ఇండియా హీరోల మాదిరి రిస్క్ చేయాలంటే భయపడుతూ ఉంటారు. అందుకే ఇతర భాషల్లో ట్రెండ్ సెట్ చేసే సినిమాలు మన తెలుగులో అంతగా ఆడవు. హీరో అంటే నాలుగు ఫైట్ లు, మాస్ డ్యాన్స్ లు ఓ ఐటెం సాంగ్ అన్నట్టే ఉంటుంది సీన్. ఇప్పుడు చాలా మంది హీరోలు అది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఇప్పుడు అది బ్రేక్ చేయడానికి ముందు అడుగు వేసాడు. ఆర్ఆర్ఆర్, దేవర సినిమాల్లో ఎన్టీఆర్ కంప్లీట్ గా డిఫరెంట్ గా కనిపించాడు. ఎన్టీఆర్ తో ఇప్పుడు బాలీవుడ్ ట్రై చేయడానికి రీజన్ కూడా అదే. వార్ 2 లో ఎన్టీఆర్ ఎలా చూపిస్తారు, ఎన్టీఆర్ యాక్షన్ ఎలా ఉంటుంది అన్నదే బాలీవుడ్ జనాల ఫోకస్. తన పాత్రకు వెయిట్ ఉంటే ఏ రేంజ్ లో అయినా యాక్షన్ చేయడానికి ఎన్టీఆర్ వెనకడుగు వేయడు. అందుకే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ కు కొన్ని సీన్స్ లో మంచి మార్కులు పడ్డాయి అనే చెప్పాలి.
ఇప్పుడు బాలీవుడ్ ఎన్టీఆర్ పై స్ట్రాంగ్ ఫోకస్ చేసింది. ఏం చేసినా బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లెక్క కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. తమ ఫ్యూచర్ ను ఎక్కువగా ఫోకస్ చేస్తూ మూవీస్ ను టేకప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో అలాగే ప్లాన్ చేస్తున్నారు కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా. ఎన్టీఆర్ బొమ్మకు ఇప్పుడు సౌత్ లో వందల కోట్ల వాల్యూ ఉంది. దేవర సినిమాను ఏ రేంజ్ లో ట్రోల్ చేసినా… బాక్సాఫీస్ ను ఏలింది. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ ను అడ్డం పెట్టుకుని సౌత్ సినిమాపై పాగా వేయడానికి రెడీ అవుతోంది ముంబై టౌన్.
ఎన్టీఆర్ కు మంచి కథలు వినిపించి… హిట్ సినిమాలను ప్లాన్ చేస్తే… సౌత్ లో తమ మార్కెట్ పెంచుకోవచ్చు. క్రమంగా ఇక్కడి స్టార్ హీరోలతో మంచి స్టోరీస్ లైన్ చేసుకుని భారీ ప్రాజెక్ట్ లు టేకప్ చేసే ఛాన్స్ ఉంటుంది. కన్నడలో యష్, రిషబ్ శెట్టి మలయాళంలో దుల్కర్ సల్మాన్… తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా చాలా మందే ఉన్నారు. వీళ్ళకు నేషనల్ లెవెల్ ఇమేజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు కాస్త జాగ్రత్తగా వర్కౌట్ స్టార్ట్ చేసింది బాలీవుడ్. మరి ఫ్యూచర్ లో ఏ రేంజ్ లో వర్కౌట్ చేస్తారో చూడాలి.