దేవర సినిమా దసరా ముందు మళ్ళీ జాతర మొదలుపెట్టింది. నెగటివ్ టాక్ తో ముందు ఇబ్బంది పడినా సినిమా ఇప్పుడు సునామీ సృష్టిస్తోంది. విడుదలై రెండు వారాలు పూర్తైనా సినిమా సందడి మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. నెగటివ్ టాక్ తో సినిమాను ఏ వైపు నుంచి టార్గెట్ చేసినా సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులు మాత్రం అంతకు మించి ఓ సినిమాలో ఏం ఉంటుంది అంటూ పాజిటివ్ గా మాట్లాడటం దేవరకు బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టి పోరాటమే చేసారు.
దేవర సినిమాపై టాలీవుడ్ లో కూడా కొందరు కావాలనే టార్గెట్ చేయడం ఎన్టీఆర్ ను ఒంటరి చేసారనే కసి కూడా ఫ్యాన్స్ లో పెరిగింది. దీనితో దేవర విషయంలో గట్టిగా ప్రమోషన్స్ చేసారు. విడుదల తర్వాత వసూళ్లు పెరగడంతో ఎన్టీఆర్ కూడా దూకుడుగా ప్రమోషన్స్ చేసాడు అనే చెప్పాలి. ఇదిలా ఉంచితే ఇప్పుడు దసరాకు మళ్ళీ దేవరే జనాలకు దిక్కు అయింది అనే టాక్ వస్తోంది. రజనీ కాంత్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదని… తమిళంలో సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చినా తెలుగులో మాత్రం ఫ్లాప్ అనే టాక్ వచ్చింది.
దానికి తోడు రతన్ టాటా మరణం కూడా రజనీ కాంత్ వేట్టాయన్ సినిమాకు మైనస్ అయింది అనే చెప్పాలి. అందుకే పెద్దగా సోషల్ మీడియాలో కూడా హడావుడి జరగలేదు. అయితే సినిమా చూసిన వాళ్ళు మాత్రం దేవర సినిమా బెస్ట్ అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే దేవరకు క్రమంగా దసరా సెలవలు కలిసి వస్తున్నాయి. సినిమాకు ఆన్లైన్ లో టికెట్ లు మళ్ళీ భారీగానే బుక్ అయ్యేలా కనపడుతున్నాయి. బుక్ మై షో సహా పలు బుకింగ్ యాప్స్ లో టికెట్ లు భారీగా బుక్ చేస్తున్నారు జనాలు.
కచ్చితంగా దసరా రోజు సినిమా చూడటం అనేది కొంత మంది ఎంజాయ్మెంట్ గా భావిస్తూ ఉంటారు. దేవర సినిమాను ముందు రోజుల్లో చూడకుండా హాలిడేస్ లో చూద్దాం అనుకునే వాళ్ళు, అలాగే పిల్లలకు హాలిడేస్ ఇస్తే వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అందరూ టికెట్ లు భారీగా బుక్ చేస్తున్నారు. గంటలో దేవరకు 2 వేల టికెట్ లు యావరేజ్ గా బుక్ అవుతున్నాయి. వీకెండ్ కావడం, దసరా రావడంతో జనాల సందడి ఓ రేంజ్ లో ఉంది. అటు సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా కూడా అంత గొప్పగా లేకపోవడం సినిమాకు కలిసి వచ్చింది.