మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వచ్చేనెలా ఖరిలోగా వార్ 2 షూటింగ్ కి పేకప్ చెప్పబోతున్నాడు. కేవలం రెండు షెడ్యూల్స్ మాత్రమే భాకీ… ఆతర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీకెండ్ నుంచి డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ షురూ కాబోతోంది. ఇలాంటి టైంలో ఉగాది పండగ గిఫ్ట్ ని రెడీ చేశాడు తారక్. కాకపోతే ఆ గిఫ్ట్ మనకి కాదు.. ఓన్లీ ఫర్ జపనీస్ కి. ఇక్కడ ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ గా షూటింగ్ తో బిజీ కానున్న తారక్, మార్చ్ లో మాత్రం జపాన్ లో సినీ సునామీకి రెడీ అయ్యాడు. ఫిబ్రవరి ఎండ్ లో డ్రాగన్ సాంగ్ షూటింగ్ ని ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్, అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ ప్లాన్ చేశాడు. అంటే మార్చ్ ఎండ్ లో తారక్ పాటల తూటాలు పేలుస్తుంటే, జపాన్ లో దేవర వసూల్ల సునామీ క్రియేట్ చేయబోతోంది. ఎగ్జాక్ట్ గా మార్చ్ ఎండ్ కి దేవర దరువు జపాన్ లో షురూ కాబోతోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మార్చ్ 15 నుంచి 25 వరకు జపాన్ లో పర్యటించబోతున్నాడు. కంటిన్యూయస్ గా పదిరోజులు అక్కడే 5 నగరాల్లో దేవర ప్రచారానికి సిద్దమౌతున్నాడు. ఎగ్జాక్ట్ గా దేవర మూవీ జపాన్ లో ఉగాది స్పెషల్ గా రిలీజ్ కాబోతోంది. అక్కడ ఉగాది లాంటి పండగలుండవు. కాని ఇక్కడ మన ఉగాదిని, అక్కడికి దేవర రూపంలో తీసుకెళ్లబోతున్నాడట.
ప్రజెంట్ బాలీవుడ్ మూవీ వార్ 2 లో క్లైమాక్స్, తోపాటు పాటల షూటింగ్ తాలూకు పెండింగ్ వర్క్ పూర్తిచేయబోతున్నాడు తారక్. వచ్చేనెల సంక్రాంతికి చిన్న బ్రేక్ వదిలేస్తే, జనవరి 30 లోగా వార్ 2 క్లైమాక్స్ తోపాటు, మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుంది. కేవలం 3 పాటల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంటుందని తెలుస్తోంది
సో ఫివ్రబరి ఫస్ట్ వీక్ లో 6 తేదీ నుంచి ఇక డ్రాగన్ సెట్లో అడుగుపెడతాడు తారక్. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తను చేయబోతున్న ఈ సినిమా షూటింగ్ ని మార్చ్ 10 వరకు రెండు బ్రేకులతో ప్లాన్ చేశారట. అలా రెండు షెడ్యూల్స్ డ్రాగన్ షూటింగ్ పూర్తయ్యాక, జపాన్ పయనం కాబోతున్నాడు తారక్.
జపాన్ లో తనకు, తన పాటలకు, తన డాన్స్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. యూ ట్యూబ్ లో కూడా తన పాటలకు డాన్స్ చేస్తూ కవర్ అప్ సాంగ్స్ తో సందడి చేసే జపనీస్ వీడియోలు కూడా ఇక్కడ వైరల్ అయ్యాయి. అలాంటి ఫ్యాన్స్ కోసం మార్చ్ లో జపాన్ వెళ్లబోతున్నాడు తారక్
దేవర ఎగ్జాక్ట్ గా మార్చ్ 28న జపాన్ లోరిలీజ్ కాబోతోంది. అంటే ఉగాది పండక్కి ఎగ్జాక్ట్ గా రెండు రోజుల ముందు దేవర టోక్యోలో సందడి చేయబోతోంది. సో జపాన్ ఫ్యాన్స్ మధ్యే ఎన్టీఆర్ ఉగాది పండగని సెలబ్రేట్ చేసుకునేలా ఉన్నాడు. ఐతే ప్రశాంత్ నీల్ విచిత్రంగా ఉగాదికి డ్రాగన్ థీమ్ సాంగ్ ప్రోమోని వదలాలనుకుంటున్నాడట. 2026 సంక్రాతికి రిలీజ్ అనుకున్న ఈమూవీని ఇప్పటి నుంచే ప్రమోట్ చేయటం కూడా మొదలుపెట్టబోతున్నాడు ప్రశాంత్ నీల్
అంటే ఉగాదికి ఇక్కడ డ్రాగన్ సాంగ్ రీసౌండ్ చేస్తే, జపాన్ లో దేవర వసూల్ల సునామీలు మొదలౌతాయని ఫిక్స్ అవ్వాల్సి వస్తోంది. మొత్తంగా ఉగాదికి ఒకేసారి ఇక్కడి ఫ్యాన్స్ కి పాటతో పండగొస్తుంటే, అక్కడి జనాలకి దేవర మాస్ దూకుడుతో పండగ మొదలవబోతోంది.