హే దేవర.. సునామీ తెచ్చిన తన లానే పుష్ రాజ్ కి ఎంత కష్టం..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర నార్త్ ఇండియాలో వసూళ్లు ఫైనల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. 480 కోట్ల గ్రాస్ వసూళ్లతో నార్త్ మార్కెట్ లో 500 కోట్ల క్లబ్ కి దరిదాపుల్లోకి వెళ్లింది దేవర దూకుడు. ఇలా ఫ్యాన్స్ సంబర పడేలోపు, కరెక్ట్ గా టైం చూసి యాంటీ ఫ్యాన్స్ ఓ వీడియోని నెగెటీవ్ గా వైరల్ చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 29, 2024 / 12:45 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర నార్త్ ఇండియాలో వసూళ్లు ఫైనల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. 480 కోట్ల గ్రాస్ వసూళ్లతో నార్త్ మార్కెట్ లో 500 కోట్ల క్లబ్ కి దరిదాపుల్లోకి వెళ్లింది దేవర దూకుడు. ఇలా ఫ్యాన్స్ సంబర పడేలోపు, కరెక్ట్ గా టైం చూసి యాంటీ ఫ్యాన్స్ ఓ వీడియోని నెగెటీవ్ గా వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మీద బురద చల్లి ఇంకా కుల్లుని ప్రదర్శించే చెత్త పనుల్లో బిజీ అయ్యారు. ఇలాంటి టైంలో అచ్చంగా ఇలాంటి కష్టాలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎదురయ్యాయి. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ తో దూరం పెరగటమే పెద్ద మైనెస్ అనుకుంటే, యాంటీ ఫ్యాన్స్ సరికొత్తగా తనని టార్గెట్ చేయటం మరోమైనెస్. ఇలాంటి టైంలో పుష్ప 2 కి తెలంగాణలో ఇబ్బందులు తప్పేలా లేవు. కావాలని పోలీస్ పర్మీషన్ ఇవ్వకపోవటం కాదుకాని, రియాలిటీ కూడా అలానే ఉంది… దేవర ఎలాగైతే తెలుగు రాష్ట్రాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్లు లేకుండా రిలీజ్ అయ్యిందో అలాంటి పరిస్థితే పుష్పరాజ్ కి వచ్చినట్టుంది. ఆల్ మోస్ట్ సిమ్ టమ్స్ అలానే ఉన్నాయి…

దేవర ముంబై, లక్కో లో ఫైనల్ వసూళ్ల లెక్క 80 కోట్లని తేలింది. మొత్తం నార్త్ ఇండియాలో 480 కోట్లకు పైనే కలెక్ట్ చేసి, 500 కోట్లు రాబట్టిన సౌత్ సినిమాల లిస్ట్ కి కాస్త దగ్గరలో వెళ్లింది. ఓవరాల్ గా నార్త్ ఇండియాలో దేవర సినీ సునామీ ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. ఈ న్యూస్ వైరల్ అయ్యేలోపు, ఎన్టీఆర్ తన ఫ్యామిలీఅండ్ ఫ్రెండ్స్ తో బయట సరదాగ గడిపిన వీడియో ఒకటి తప్పుగా ప్రచారం చేస్తూ, తారక్ మీద బురద చల్లే ప్రయత్నం జరిగింది

తన వైఫ్ తో పాటు, వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తో ఎన్టీఆర్ నడిచొస్తూ సరదాగా నడుస్తుంటే, దాన్ని ఆల్కాహాల్ తో ముడిపెడుతూ, దిక్కుమాలిన టైటిల్స్ తో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దేవర వచ్చి నెలలు గడుస్తుండటమేకాదు, ఎన్నో కామెంట్లు, ట్రోలింగ్స్ ని ఫేస్ చేసి వందలకోట్ల వసూళ్లు రాబట్టింది. అయినా కుళ్లు బ్యాచ్ ఇంకా ఏదో బురద చల్లాలని అసూయ బుద్దితో పిచ్చిపని చేయటం ఆపట్లేదు..

ఇలా దేవరకి విడుదల ముందునుంచి, రిలీజై హిట్టై, వసూళ్ల వరదలొచ్చాక కూడా కుళ్లు బ్యాచ్ నుంచి కామెంట్ల దాడి తప్పట్లేదు. అయినా వాటితో మ్యాన్ ఆఫ్ మాసెస్ కి వచ్చే నష్టమేమి లేదు. కాకపోతే అచ్చంగా ఇలాంటి ఇబ్బందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎదురౌతున్నాయి.

పుష్ప 2 డిసెంబర్ 6 కి రిలీజ్ అన్నటైంలో పెద్దగా ఎలాంటి కామెంట్స్ లేవు. కాని ఏపీ ఎలక్షన్స్ టైంలో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేశాడన్న కోపం మెగా ఫ్యాన్స్ కి, జనసైనికులుకి పెరిగిపోయింది. టీడీపీ కర్యాకర్తలు బాలయ్య ఫ్యాన్స్ కూడా బన్నీమీద గుర్రుగానే ఉన్నారన్నారు. పవన్ స్టేట్మెంట్ తర్వాత జనసైనికులు కూడా లైట్ తీసుకున్నారు.

ఇక అంతా సద్దుమనిగిందననుకునేలోపు, ఇప్పుడు పుష్ప 2 కి ఈవెంట్ల కష్టాలు ఎదురయ్యాయి. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి తెలంగాణలో పోలీస్ పర్మీషన్ కష్టమే అంటున్నారు. దసరా టైంలో దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ అనేసరికి సెక్యూరిటీ కోసం పోలీస్ ఫోర్స్ కష్టమన్నారు. కారణం 4 వేల మంది పట్టే నోవా టెల్ ఈవెంట్ కి 30 వేలకు పైనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ రావటం..

అచ్చంగా అలానే పుష్ప 2 ఈవెంట్ కి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ క్యూ కడితే ఏంటి పరిస్థితనే డౌట్లున్నాయి. పుష్ప హిట్ కాబట్టి, పుష్ప 2 మీద భారీ అంచనాలుంటాయి. అందుకే బన్నీ ఫ్యాన్స్ మూకుమ్మడిగా ఈవెంట్ కి వస్తే, అసలే దీపావలి, క్రిస్మస్ టైం ఎలాంటి ఇబ్బందులుండొద్దని ఆన్ లైన్ ప్రమోషన్ చేసుకోండనే సలహాలే వస్తున్నాయట. ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.